నా వార్తతో మరణ శిక్ష‌ రద్దయింది…ఎన్టీఆర్ తో ఏకాంతంగా కూర్చునేవాడిని…! ముగ్గురు ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం…

  • కలం యోధులు సిఆర్ నాయుడు అనుభవాలు

చిన్ననాటే మా అమ్మ నా జీవిత గమనానికి బాటలు పరచించింది. జీవితంలో ప్రయోజకుడు కావాలని బోధించింది. ప్రయోజకుడు కావడమంటే బోలెడంత డబ్బు సంపాదించడం కాదు…పది మందికి మేలు చేయడం, పది మంది శ్లాఘించేలా జీవించడమని చెప్పింది. ఆ ప్రభావంతోనే, డాక్టర్‌ అయితే మారుమూల ప్రజలకు సేవ చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించ వచ్చని భావించాను. అందుకే ఎస్‌ఎస్‌ఎల్‌సిలో నేను కాంపోజిట్‌ మేథ్స్‌ అయినప్పటికీ పియుసిలో బైపిసి తీసుకున్నాను. ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యాను. గ్రూప్స్‌లో ఎ ఫ్లస్‌ (డిస్టింక్షన్‌కు కొంత తక్కువ) సాధించాను. తిరుపతి మెడికల్‌ కాలేజీలో సీటు కోసం దరఖాస్తు చేశాను. అప్పట్లో 50 సీట్లు మాత్రమే ఉండేవి. రిజర్వేషన్‌ కోటా సీట్లన్నీ పోను జనరల్‌ సీట్లలో నాకు సీటు జస్ట్‌ మిస్‌ అయింది. తక్కువ మార్కులు వచ్చిన వారికి సీటు లభించి, డిస్టింక్షన్‌ స్థాయి విద్యార్థినైన నాకు రాకపోవడం…నా చిన్న హృదయం తీవ్రంగా గాయపడింది. బోరున విపించాను. ఇంతలోనే బిడిఎస్‌లో బెంగళూరులో సీటు వచ్చింది. చేరాను. చదివితే ఎంబిబిఎస్‌ చదవాలి, ఇదేమి చదువని బిడిఎస్‌కు మధ్యలోనే గుడ్‌బై చెప్పేశాను. బిఎస్‌సి పూర్తి చేసి ఆపై ఎంబిబిఎస్‌లో చేరవచ్చని ఆ కోర్సులో చేరిపోయాను.

యూఎన్‌ఐతో జర్నలిస్టు ప్రయాణం మొదలు…
బిఎస్‌సి చదువుతున్న సమయంలో మా బంధువుకు అత్యంత సన్నిహిత మిత్రుడైన మూర్తిగారనే పత్రికా సంపాదకునితో నాకు పరిచయం ఏర్పడిరది. అప్పట్లో ఆయన వార్తా ప్రపంచం అనే వారపత్రికను నడుపుతూ అత్యంత ప్రజాదరణ చూరగొన్నారు. ఆయనతో సాన్నిహిత్యం ద్వారా పాత్రికేయ వృత్తి గురించి తెలుసుకున్నాను. సమాజ శ్రేయస్సుకు దోహదపడే పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించాని నిర్ణయించుకున్నాను. అందువల్ల బిఎస్‌సి తరువాత ఎంఏ చేసి, ఆ తరువాత జర్నలిజం కోర్సు పూర్తి చేశాను. అది పూర్తయిన తరువాత యుఎన్‌ఐలో ఖాళీగా ఉన్న ఉద్యోగానికి దరఖాస్తు చేశాను. వారు పెట్టిన పరీక్షలో మొదటి స్థానంలో నిబడడంతో నాకు ఆ ఉద్యోగం వచ్చింది. 1972 జూన్‌లో యుఎన్‌ఐ ఉద్యోగంలో చేరాను. అక్కడ న్యూస్‌బ్యూరోలో చీఫ్‌తో సహా ఐదుగురు ఉన్నారు. అందరూ చాలా సీనియర్లు. మంచి అనుభవజ్ఞులు. నేను చాలా చిన్నవాడిని. ఎ..బి..సి…డిలు నేర్చుకుంటున్నవాడిని.

వారంలో రోజుల్లోనే సంచన వార్త….
యుఎన్‌ఐలో చేరిన వారం రోజుల్లోనే నా చురుకుదనం చూపించాను. మైసూరు రాష్ట్రం పేరును కర్నాటక రాష్ట్రంగా మార్చబోతున్నారంటూ సరికొత్త వార్తను ఇచ్చాను. కర్నాటక అంటే అర్థమేమిటి, ఆ పేరును రామాయణ మహాభారతాలలో ఏ సందర్భాల్లో ప్రస్తావించారు వంటి వివరాన్నీ ఆ వార్తలో ఇచ్చాను. మరుసటి రోజు హిందూలో ఆ వార్తను మొదటి పేజీలో బోల్డ్‌ లెటర్స్‌లో బాక్స్‌ కట్టి ప్రచురించారు. నేను ఉదయం కార్యాయానికి వెళ్లగానే బ్యూరోచీఫ్‌ శ్రీనివాస్‌గారు నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుని అభినందించారు. ఆ సమయంలో నేను పొందిన అనుభూతి ఇప్పడు తలచుకున్నా ఒళ్లు పుకిస్తుంది. ఆ వార్త తరువాత బ్యూరో శ్రీనివాస్‌గారు ఎక్కడికెళ్లినా స్కూటర్‌లో నన్నూ తీసుకెళ్లేవారు.

కర్నాటక ముఖ్యమంత్రితో ఏకంతంగా…
అప్పట్లో దేవరాజ్‌ అర్స్‌ కర్నాటక ముఖ్యమంత్రిగా ఉండేవారు. తనకు సన్నిహితులైన ఐదుగురితో ఓ సలహా బృందం ఏర్పాటు చేసుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఆ బృందంతో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. ఆ బృందంలో శ్రీనివాస్‌గారు కూడా ఒకరు. సిఎంగారు పిలిచినపుడు శ్రీనివాస్‌గారు నన్ను కూడా తీసుకెళ్లేవారు. నేను సిఎం కార్యాయం వెలుపల కూర్చోబోతే… ‘ఇక్కడేంట్రా కూర్చునేది… నాతో రా’ అంటూ నన్నూ లోనికి తీసుకెళ్లేవారు. ‘మా యంగ్‌ డైనమిక్‌ రిపోర్టర్‌ మిస్టర్‌ సిఆర్‌ నాయుడు’ అని ముఖ్యమంత్రితో గొప్పగా చెప్పారు. ఇప్పటికీ అది నాకు మరచిపోలేని జ్ఞాపకం.

మద్రాసులో సినిమా పత్రిక సంపాదకుడిగా…
కొంతకాలం తరువాత బదిలీపై మదరాసుకు వచ్చాను. ఇక్కడా ఐదుగురు సీనియర్లు ఉన్నారు. అందువల్ల నేను ప్రెస్‌నోట్లు రాసి వెళ్లేవాడిని. బోలెడు టైం మిగిలేది. విరామ సమయంలో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్యాయానికి వెళ్లేవాడిని. ఒకరోజు నేను ఎక్స్‌ప్రెస్‌ కార్యాయంలో ఉన్న సమయంలో ప్రముఖ సినీ దర్శకుడు శ్రీధర్‌ అక్కడికి వచ్చారు. చిత్రాలయ అనే వినూత్న సినీ వారపత్రికను దినపత్రిక సైజులో 34 పేజీలతో ముద్రించాలని నిర్ణయించుకుని, దాన్ని ఎక్స్‌ప్రెస్‌లో ముద్రించే ఆలోచనతో అక్కడికి వచ్చారు. ఎక్స్‌ప్రెస్‌ జిఎంగారు నన్ను శ్రీధర్‌ గారికి పరిచయం చేశారు. ‘మీరు మా పత్రికలో తప్పక చేరాలి’ అని అన్నారు. నాకు బోలెడు టైం ఉంది, అందులోనూ ఇది సినీ పత్రిక, చూద్దాం అన్నాను. చిత్రాయల పత్రికకు మోహన్‌రావు అనే సీనియర్‌ పాత్రికేయుడు సంపాదకుడిగా నియమితుయ్యారు. ఆయన నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణకు ఆంతరంగిక మిత్రుడు. షూటింగులకు కృష్ణతో పాటు విదేశాలకూ వెళ్లేవారు. ఈ పరిస్థితుల్లో మోహన్‌రావుగారే ‘సిఆర్‌ నాయుడిని ఎడిటర్‌గా పెట్టుకోండి’ అని శ్రీధర్‌కి సూచించారు. దాంతో చిత్రాయలకు ఎడిటర్‌ అయ్యాను.

ఎన్‌టిఆర్‌ ఎదుట ఏకాంతంగా….
చిత్రాలయలో ఎన్‌టిఆర్‌ గురించి ప్రత్యేకంగా ఎన్నోరకాల వార్తలు, వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు రాసేవాడిని. ఆయన నా రచనా పాటవానికి ఎంతో ముగ్దులయ్యేవారు. స్టూడియోలో షూటింగు జరుగుతున్నపుడు విరామ సమయంలో ఆయన ఏకాంతంగా కూర్చునేవారు. ఆయన ముందు చిన్న బల్ల మాత్రమే ఉండేది. నా రాకను గమనిస్తే వెంటనే…‘రండి బ్రదర్‌ రండి’ అని అప్యాయంగా పిలిచేవారు. ఆయన ఓ మారు అలా తల తిప్పిదే…. మరో కుర్చీ తీసుకొచ్చిపెట్టేవారు. ఆ విధంగా ఎన్‌టిఆర్‌ ఎదుట కూర్చుని ఏకాంతంగా మాట్లాడే అవకాశం సినీ జగత్తులో మోహన్‌రావు గారి తరువాత నాకు దక్కింది. ఆ నాటి మధుర స్మృతున్నీ నా మదిలో నిలిచిపోయాయి.

ఈనాడుతో బంధం…
చిత్రాలయ ఎడిటర్‌గా పని చేస్తున్న సమయంలో ఓసారి ఎబికె ప్రసాద్‌ గారు మద్రాసుకు వచ్చారు. మర్యాదపూర్వకంగా కలిశాను. ‘అరే అబ్బాయి…చాకులాంటి కుర్రాడివి. నీ శక్తిసామర్థ్యాను దినపత్రికకు ఉపయోగించాలిగానీ ఇక్కడ ఉండిపోవడమేమిటి’ అంటూ విశాఖలో ప్రారంభంకానున్న ఈనాడు గురించి, రామోజీరావు ఆశయాల, సంకల్పం గురించి చెప్పారు. తెలుగు దినపత్రికలో రంగప్రవేశం చేయడమే సముచితమని మద్రాసుకు గుడ్‌బై చెప్పి విశాఖపట్నం బయుదేరాను. ఆనాడు ఈనాడుతో పెనువేసుకున్న బంధం దశాబ్దానికిపైగా సాగింది. హైదరాబాద్‌లో ఈనాడు ఎడిషన్‌ ప్రారంభమైనప్పుడు సిటీ న్యూస్‌బ్యూరోలో చేరాను. అప్పట్లో అతిరథమహారథులతో సాంతగ్యం ఏర్పడిరది. ఉద్దండ పండితులైన పివి కృష్ణ, ఎబికె ప్రసాద్‌, పొత్తూరు వెంకటేశ్వరరావు, రాంబట్ల క్రిష్ణమూర్తి, గజ్జల మల్లారెడ్డి వంటి వారితో కలిసి పనిచేసే మహాభాగ్యం నాకు కలిగింది. వీరంతా ఒకొక్కరూ ఒక ఎన్‌సైక్లోపీడియా. వీరితో ఒకసారి మాట్లాడితేనే వంద పుస్తకాలు చదివినంత పరిజ్ఞానం భించేది. అలాగే రామోజీరావుతో కూడా రోజూ కొంత సమయంలో మాట్లాడే అవకాశం నాకు లభించింది. మనం చెప్పే విషయం ఎటువంటిదైనా సూటిగా పాఠకు మనసుల్లోకి దూసుకుపోయేట్లు ఉండాలి అని చెప్పేవారు.

ఓ అభాగ్యురాలి బతుకు మారింది…
హైదరాబాద్‌లో ఓ రోజు ఉదయాన్నే టాంకుబండ్‌ సమీపంలో ఉన్న రోడ్డులో వెళుతూవున్నా. అక్కడున్న ఓ చెత్తకుండీలో ఓ మహిళ చెత్త వస్తువులను పోగు చేసుకుంటూ ఉంది. ఈ లోగా ఆ పక్కనే ఉన్న మేడపై నుంచి ఒకావిడ చెత్తను తొట్లో కుమ్మరించింది. అదంతా కుండీవద్ద ఉన్న మహిళపై పడిరది. అదేమిటమ్మా మనిషి ఉన్నా పట్టించుకోకుండా అలా చెత్త కుమ్మరింవేంటి అని అడగ్గానే…ఆ ఇండావిడ ఆమెను ఆగ్లంలో చెడామడా తిట్టిపారేసింది. అంతే చెత్తపోగు చేసుకుంటున్న ఆవిడ అంతకన్నా చక్కని ఆంగ్లభాషలో సమాధానం గడగడా చెప్పేసింది. ఈ సంఘటన చూసి నేను అవాక్కయ్యాను. చెత్తపోగు చేసుకునే మహిళకు అంత చక్కని ఆంగ్లభాష ఎలా వచ్చిందని ఆమె దగ్గరికెళ్లి మాట్లాడాను. తన దీన గాథ వివరించింది. ఆమె ఇంగ్లీషు లిటరేచర్‌ చదివిన వ్యక్తి. భర్త చనిపోవడంతో ఆస్తినంతా కాజేసి ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ఇద్దరు చిన్న పిల్లలతో బజారునపడిరది. జీవనాధారం కోసం చెత్తపోగు చేసి అమ్ముకుంటున్నానని కంట తడిపెట్టింది. ఈ గాథను మానవీయ కథనంగా రాశాను. దాన్ని ఈనాడు మొదటి పేజీలో బాక్సుకట్టి ప్రచురించారు. వార్తతో స్పందించి ఉపాధి కల్పించేందుకు పలువురు ముందుకొచ్చారు.

నా వార్తతో మరణ శిక్ష రద్దయింది…
నేను చికూరిపేటలో పని చేస్తున్న సమయంలో మరో విలేకరితో కలిసి వెళుతుండగా ఓ ఇంటి వద్ద జనం మూగివున్నారు. అక్కడికెళ్లి విచారించాను. ఆ కుటుంబానికి చెందిన ఓ యువకుడు పెళ్లయిన నెలకే దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ కారు ప్రమాదం కేసులో అతనికి మరణశిక్ష విధించారు. ఆ యువకుడు తల్లిదండ్రుకు ఒకే కుమారుడు. మరణశిక్షతో కుటుంబమంతా విషాదంలో మునిగిపోయింది. ఘటనకు సంబంధించి ఆ యువకుడు ఇంటికి రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్లి, దాని ఆధారంగా ఓ కథనం రాశాను. మొదటి పేజీలో ప్రచురితమయింది. ఆ వార్తను చూసిన స్థానిక ఎంఎల్‌ఏ కోన ప్రభాకర్‌రావు వెంటనే స్పందించారు. అప్పటి విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న పివి నరసింహరావు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం చేసిన మధ్యవర్తిత్వం వల్ల ఆ యువకునికి దుబాయి కోర్టు క్షమాభిక్ష పెట్టింది. నా వార్తతో ఒకరి ప్రాణాలు కాపాడగలిగానన్న సంతృప్తి, ఆనందం ఇప్పటికీ ఉంది. గుంటూరులో పని చేస్తున్న కాంలో స్టూవర్ట్‌పురంలో బసిచేసి అక్కడి దొంగ గురించి పది ఆసక్తికర కథనాలు రాశాను. వాటికి పాఠకుల నుంచే కాకుండా ఈనాడు ఛైర్మన్‌ రామోజీరావుగారి నుంచి కూడా ప్రశంసలు లభించాయి. అప్పుడు నా ఆనందానికి అవధుల్లోలేవు.

అట్టుడికిన హైదరాబాద్‌…
హైదరాబాద్‌లో పని చేస్తున్న రోజుల్లో…ఓ రోజు నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో ఒక యుక్తవయుసు యువతి హృదయ విదారకంగా రోదిస్తోంది. ఆమె వద్దకు వెళ్లి విచారించాను. తాను, తన భర్త రెండో ఆట సినిమా చూసి రిక్షాలో వెళుతుండగా పోలీసులే భర్తపై దాడి చేసి తనపై అత్యాచారం చేశారని చెప్పింది. ఆమె ముస్లిం యువతి. ‘నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌లో రమేజామి మానభంగం’ శీర్షికతో రాసిన వార్త మొదటి పేజీలో ప్రచురితమయింది. త్లెవారే సరికి ఉస్మానియా విద్యార్థులు పోలీస్‌ స్టేషన్‌ను చుట్టుముట్టారు. పాత నగరం అట్టుడుకిపోయింది. పోలీసు కర్ఫ్యూ వరకు వెళ్లింది. అప్పటి సిఎం మర్రి చెన్నారెడ్డి విచారణకు ఆదేశించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ముక్తదార్‌తో ఏకసభ్య కమిటీ వేశారు.

రేణిగుంట సిఆర్‌ఎస్‌ తరలింపు కుట్ర భగ్నం…
నేను తిరుపతిలో పని చేస్తున్న సమయంలో రేణిగుంట రోడ్డులో సిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అవసరమైన భూమిని కేటాయించాని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే అందుకు ‘ఎస్‌’ అనింది. కానీ భూమి కేటాయింపులో జాప్యం జరిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని తమిళనాడుకు చెందిన నాయకులు దాన్ని తమ రాష్ట్రానికి తీసుకెళ్లాని ప్రయత్నించారు. స్థలం ఎంపిక కోసం కేంద్రం ఒక కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీ తమిళ నాయకులతో కుమ్మక్కయి…తమిళనాడులోనే సిఆర్‌ఎస్‌ స్థాపించానే విధంగా ఒక నివేదికను ముందే రూపొందించుకుని తిరుపతికి వచ్చింది. అయితే ఈ నివేదిక సంపాదించి…. సిఆర్‌ఎస్‌ను తరలించుకుపోయేందుకు కుట్ర జరుగుతోందని వార్త రాశాను. ఇది సంచనం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం పరుగు తీసింది. ఆఘమోఘాలపై అప్పటి సిఎం చెన్నారెడ్డి స్థలం కేటాయించారు. చివరికి సిఆర్‌ఎస్‌ రేణిగుంటకే దక్కింది.

ఎంఎల్‌ఏ ఖండన ప్రచురించడానికి నిరాకరించి…
ఈనాడులో పని చేస్తుండగా లోకల్‌ ఆఫీసుకు తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పుత్తూరు ఎంఎల్‌ఏ కెబి సిద్దయ్య నిర్వహించిన సమావేశాన్ని సర్పంచులంతా బాయ్‌కాట్‌ చేశారని నగరి విలేకరి వార్త రాశారు. ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించారు. అయితే అలా జరగలేని ఖండిస్తూ ఎంఎల్‌ఏ వివరణ పంపారు. జరిగింది వాస్తవం కాబట్టి ఖండన ప్రచురించలేదు. మరో పత్రికలో మాత్రం ఖండన వేశారు. దీన్నిపట్టుకుని ఆ ఎంఎల్‌ఏగారు ఈనాడు డైరెక్టర్‌ మోటూరుగారికి వద్దకు వెళ్లి ఇచ్చారు. ఆయన నాకు పంపి ప్రచురిచమన్నారు. అప్పటికీ నేను అందుకు అంగీకరించలేదు. ప్రచురణకు మళ్లీ మళ్లీ ఒత్తిడి రావడంతో…‘ఈ ఉద్యోగం నాకొద్దు’ అనేసి ఆఫీసుకు తాళం వేసుకుని ఇంటికి వెళ్లిపోయాను. మూడు రోజులు తిరుపతి ఆఫీసు నుంచి వార్తలు వెళ్లకపోవడంతో మోటూరు గారే స్వయంగా తిరుపతికి వచ్చారు. ఆఫీసుకు తాళం వేసివుండటాన్ని చూసి నేరుగా మా ఇంటికి వచ్చి సర్దిచెప్పడంతో మళ్లీ ఆఫీసుకు వెళ్లాను. ఖండన మాత్రం ప్రచురించలేదు.

‘ఉదయం’లోకి….
ఉదయం దినపత్రిక ప్రారంభించడానికి ముందే శ్రీమతి దాసరి పద్మగారు మా ఇంటికి వచ్చారు. ‘పత్రిక పెడుతున్నాం. వస్తావా రావా’ అంటూ కూర్చున్నారు. ఆమె మాట కాదనలేక ఉదయం చీఫ్‌ రిపోర్టుర్‌, కోఆర్డినేటర్‌గా పని చేశాను. ఉదయంలో తొలి కథనమే సంచనాత్మకమయింది. తంబళ్లపల్లి ప్రాంతంలో గౌరీశంకర్‌ రెడ్డి మరణానంతరం రైతులకు, రాడికల్స్‌కు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో దాదాపు 20 గ్రామాల రైతులు సమావేశమై ‘రైతు కూలి సంఘం’గా ఏర్పడ్డారు. రాడికల్స్‌ వ్యవహారాలకు వ్యతిరేకంగా పని చేయాలని తీర్మానించారు. చౌడసముద్రంలో పొడవాటి స్తంభాలు నాటి పెద్ద గంట కట్టారు. సమస్య ఎదురైనపుడు గంట మోగించాలని, అలా మోగగానే రైతుంతా అక్కడికి చేరుకోవాని నిర్ణయించుకున్నారు. రాడికల్స్‌ దాడులు చేయాలని ప్రయత్నించినపుడు రైతులు ఆ గంటను మోగించి, గుమిగూడి ఎదుర్కొన్నారు. దీన్నే  ‘ఈ గంట కొడితే…’ అనే శీర్షికతో వార్త రాశాను. అయితే పోలీసులు నమ్మలేదు. అప్పటి ఎస్‌పి రావుపాటి సీతారామరావు స్వయంగా అక్కడికి వెళ్లి గంట మోగించారు. రైతులంతా గుమిగూడారు. అప్పుడే అక్కడ పోలీస్‌ అవుట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. వార్త రాసినందుకు నన్ను అభినందించారు. అలాగే టిటిడిలో అవినీతిపై రాసిన 20 వరుస కథనాలు అప్పట్లో సంచనం సృష్టించాయి. ఈ వార్తపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విచారణ కమిటీని నియమించారు. ఒక ఎస్‌ఈని సస్పెండ్‌ చేశారు.

ముఖ్యమంత్రులతో…
బెంగుళూరులో పని చేసేటప్పుడు చిన్న వయసులోనే కర్నాటక ముఖ్యమంత్రి దేవరాజ్‌ అర్స్‌తో నేరుగా మాట్లాడి వార్తలు రాసేవాడిని. ఆంధ్రప్రదేశ్‌లో జలగం వెంగల్రావు, మర్రిచెన్నారెడ్డి, ఎన్‌టి రామారావుతో దగ్గర సంబంధాలు ఉండేవి. రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినపుడు నేను, హిందూ పత్రిక రాజేంద్రప్రసాద్‌తో కలిసి జలగం వెంగల్రావుతో ఏరియల్‌ సర్వేకి వెళ్లిన సందర్భాన్ని ఎప్పటికీ మరచిపోలేను. వెంగల్రావుగారు, చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రులుగా తిరుపతి పర్యటనకు వచ్చినపుడు ఈనాడు ఆఫీసుకు వచ్చి టీతాగి వెళ్లిన సందర్భాలున్నాయి. నా జర్నలిస్టు జీవితంలో పలువురు ముఖ్యమంత్రుతో సన్నిహితంగా మెలిగే అవకాశం భించింది. అయితే ఏనాడూ ఆ పరిచయాలను వ్యక్తిగతంగా ఉపయోగించుకోలేదు. వృత్తి కోసమే ఆ పరిచయాలను ఉపయోగించుకుని మంచి వార్తలు రాసి సమాజానికి నా వంతు మేలు చేయగలిగాను.
– సిఆర్‌ నాయుడు, తిరుపతి

4 Comments

  1. తన రాసే అక్షరాలతో సమాజహితం కాంక్షించి పనిచేసే ఏ విలేఖరికి ,స్వార్థం ఉండదనటానికి పెద్దలు సి‌ఆర్ నాయుడి గారి ఒక గొప్ప ఉదాహరణ అనిపిస్తోంది నాకు

  2. I am proud to say Mr C R Naidu is my good friend. He is very honest and efficient journalist. He is most Intelligent& responsible for establishing Eanadu and Udayan at Tirupathi. He has earned nothing and leading very simple life.He is deserved for any position either in Govt or NGOs. This is the situation in our country.
    DR T Hanumanth rao
    Physician, Hyderabad.

  3. Respected sir, I felt immense happiness when I read your part of life ambitions and professional results which implements good aspects in the society. – sagsrbabu

Leave a Reply

Your email address will not be published.


*