నిమ్మగడ్డకు మళ్లీ నిరాశ…హైకోర్టు వ్యాఖ్యల్లో లోతైన అర్థం..!

రాష్ట్ర ఎన్నికల అధికారి గా పనిచేస్తూ ఆకస్మికంగా పదవి కోల్పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరోసారి నిరాశే ఎదురైంది. తనను ఎన్నికల అధికారిగా పునర్నియమించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటం లేదంటూ ప్రభుత్వంపై అదే హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. ఈ కేసు విచారణ శుక్రవారం జరిగింది.

హైకోర్టు సీరియస్ గా స్పందించి, వెంటనే తనను ఎన్నికల అధికారిగా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆశించారు. అయితే ఆయన ఆశించినది జరగలేదు. ఈ అంశంలో గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోర్టు ఆదేశించింది.‌ గవర్నర్ రంగంలోకి‌ రావడంతో కేను ఎ ఆసక్తికరంగా మారింది.

వాస్తవంగా ఇప్పటి దాకా ఈ కేసులో గవర్నర్ ప్రస్తావన లేదు.‌‌ ఎన్నికల అధికారిని ప్రభుత్వం నేరుగా నియమించదు.‌ ప్రభుత్వం కొన్ని పేర్లు ప్రతిపాదిస్తే…గవర్నర్ తన విచక్షణ మేరకు ఒకర్ని ఎంపిక చేసి నియమిస్తారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నియమించింది గవర్నరే. ఎన్నికల‌ అధికారి పదవీ‌కాలాన్ని‌ తగ్గిస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కు‌ ఆమోద ముద్ర వేసి, కొత్త కమీషనర్ ను నియమించింది కూడా గవర్నరే.

అయితే…వివాదంతా ప్రభుత్వానికి, నిమ్మగడ్డకు మధ్య సాగుతూ వచ్చింది. నిమ్మగడ్డను‌ ఎలా తొలగిస్తారనిగానీ, కొత్త కమిషనర్ ను ఎలా నియమిస్తారనిగానీ గవర్నర్ ను కోర్టు ప్రశ్నించలేదు.‌ ప్రభుత్వానికే ఆదేశాలు ఇస్తూ వచ్చింది. ఈ వివాదంపై గవర్నరూ ఏమీ‌ మాట్లాడలేదు. తమ తీర్పును అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను కోర్టు ఆదేశించజాలదు. అందుకే…తీర్పును అమలు చేయాల్సిందిగా గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించాలని కోర్టు నిమ్మగడ్డకు సూచించింది.

ఇప్పుడు ఏం జరుగుతుందన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం. ఎన్నికల అధికారి పదవీకాలాన్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఉంటోంది. అయితే దాని పైన సంతకం చేసింది గవర్నరే. ఈ పరిస్థితుల్లో నిమ్మగడ్డను పునర్నిర్మించి, గతంలో తాను చేసింది తప్పని గవర్నర్ ప్రకటించుకుంటారా..! ఆ పని చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఆ తీర్పు వచ్చేదాకా వేచి చూస్తారా..! అది గవర్నర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.

ఏదిఏమైనా ఇప్పుడు బాలు గవర్నర్ కోర్టులోకి వెళ్లింది. ఇంకా చెప్పాలంటే హైకోర్టే బాలును గవర్నర్ కోర్టులోకి విసిరింది. ఒకవేళ గవర్నర్…ఆర్డినెన్స్ మీద సంతకం చేయడాన్ని సమర్దించుకుంటూ, నిమ్మగడ్డ తొలగింపు, కొత్త కమిషనర్ కనగరాజన్ నియామకం సరైనదే అని ప్రకటిస్తే అప్పుడు నిమ్మగడ్డ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది.

ఈకేసుకు సంబంధించి హైకోర్టు, ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్డినట్లు కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి. న్యాయమూర్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారన్నది పక్కన పెడితే….ప్రభుత్వ వాదనలు వినడానికి, కౌంటర్ దాఖలు చేయడానికి అవకాశం ఇచ్చిందంటేనే… వాదనలనూ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లెక్క. తమ ప్రభుత్వ సిఫార్సుతో జరిగిన కనగరాజ్ నియామకం చెల్లకపోతే…చంద్రబాబు ప్రభుత్వ సిఫార్సుతో నియమితులైన నిమ్మగడ్డ మియామకమూ చెల్లదని, అందుకే‌ ఆయన్ను తిరిగి నియమించలేమని ప్రభుత్వం వాదిస్తోంది.

హైకోర్టు తీర్పులోని అంశాన్ని ఆధారం చేసుకునే…ఇటువంటి వాదనను ప్రభుత్వం సుప్రీంలోనూ వినిపించింది. ఇప్పుడు అదేమాటను హైకోర్టుకూ చెబుతోంది. ప్రభుత్వ వాదన‌ను వినడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అంటే ప్రభుత్వ వాదనలో ఎంతోకొంత బలముందనే అర్థ. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ వేసిన కోర్టు ధిక్కారణ కేసులోనూ ప్రభుత్వ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లు అర్థమవుతుంది. ఇది ప్రభుత్వానికి ఊరట ఇచ్చేదే తప్ప… ఒక వర్గం మీడియా చెబుతున్నట్లు మొట్టికాయలు వేయించుకోవడం కాదు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*