నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఆశలపై నీళ్లు..! లా పాయింట్లు లాగిన ప్రభుత్వం..!!

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారం ఎవరూ ఊహించని మలుపు తిరిగింది. ఈ విషయంలో శనివారం రాత్రి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైకోర్టు తీర్పులోని లా పాయింట్లను బయటకు లాగింది ప్రభుత్వం. ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేయడానికి ప్రభుత్వం సన్నద్ధవముతోంది. ఇదే సమయంలో, ఎన్నికల కమిషనర్‌ కూర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్న నిమ్మగడ్డ ఆశలపైన ప్రభుత్వం నీళ్లు చల్లింది.

ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సుబ్రమణ్య శ్రీరామ్‌ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అత్యంత కీలక, ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలో సిఫార్సు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, అది పూర్తిగా గవర్నర్‌ విచక్షణకు సంబంధించిన అధికారమని, కగకరాజ్‌ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సు కూడా చ్లెదని, నిమ్మగడ్డను పునర్‌ నియమించడానికి చర్యలు తీసుకోవాని….హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఈ కీలక అంశాలే ఇప్పుడు నిమ్మగడ్డకు ప్రతికూలంగా మారాయి. తనకు అనుకూంగా వచ్చిందనకున్న తీర్పులోనే ప్రతికూల విషయాలున్న సంగతిని ఆయన గుర్తించినట్లు లేదు. కనగరాజ్‌ను తమ ప్రభుత్వం సిఫార్సు చేయడానికి వీల్లేనపుడు…. 2015లో చంద్రబాబు ప్రభుత్వం సిఫార్సు చేసిన నిమ్మగడ్డ నియామకం మాత్రం ఎలా చెల్లుతుందన్న లా పాయింట్‌ను అడ్వొకేట్‌ జనరల్‌ బయటకు తీశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను పునర్‌ నియమించడమూ సాధ్యం కాదని ఆయన చెప్పారు. అదేవిధంగా మరో అంశాన్నీ ప్రస్తావించారు. కోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే…తాను ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టానంటూ రమేష్‌ కుమార్‌ తనకు తానుగా ప్రకటించుకుని, కింది స్థాయి దాకా సర్క్యులర్లు పంపారు. ఇది చెల్లదన్నది ఏజీ వాదన. ఆయన్ను తిరిగి నియమించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది తప్ప, స్వీయ నియామకానికి అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. అసలు ఆయన నియామకమే చెల్లనపుడు…తిరిగి ఎలా నియమిస్తామన్నది ప్రభుత్వ వాదన.

రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు, అమలు సాధ్యం కానిదిగా ఉందని, దీనిపైన సుప్రీంలో సవాలు చేస్తున్నామని, ఈ మేరకు తీర్పుపై స్టే ఇవ్వాల్సిందిగా హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశామని శ్రీరాం చెప్పారు. సుప్రీం కోర్టుకు వెళ్లకున్నా…హైకోర్టు తీర్పును అమలు చేయడానికి ప్రభుత్వానికి రెండు నెలల గడువు ఉంటుందని శ్రీరామ్‌ వివరించారు. ఈ అంశాన్నీంటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం కార్యదర్శి…అన్ని జిల్లాకు శనివారం రాత్రి ఒక సర్క్యుర్‌ జారీ చేశారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాల్సిన అవసరం లేదన్నది దాని సారాంశం. ఎన్నిక కమిషనర్‌ నియామకంపై ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉన్నందున, తనకు తాను కమిషనర్‌గా నియమితులైనట్లు ప్రకటించుకుని, ఇచ్చిన సర్క్యులర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలావుండగా…ఎన్నికల కమిషనర్‌ కుర్చీలో కూర్చోడానికి రమేష్‌ కుమార్‌ చూపుతున్న అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల్లోనే…తనకు తానుగా కమిషనర్‌గా పునర్‌ నియామకం జరిగినట్లు ప్రకటించుకుని, ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఎన్నిక సంఘం వాహనాలను హైదరాబాద్‌లోని తన నివాసానికి పంపాని అధికారులను ఆదేశించారు. ఎన్నిక సంఘం తరపున హైకోర్టులో న్యాయవాదిగా ఉన్న ప్రభాకర్‌ తొగింపునకు చర్యలు మొదలు పెట్టారు. తక్షణం రాజీనామా చేయాల్సిందిగా ప్రభాకర్‌ను ఆదేశించారు. ఇవన్నీ ఆయన్ను విమర్శపాలు చేస్తున్నాయి.

ఈ కేసు వ్యవహారం చూస్తుంటే…రాజ్యంగం పరంగానే అనేక సందిగ్ధతలు తలెత్తుతున్నాయి. అసలు రాష్ట్రాల ఎన్నిక సంఘం అధికారులను ఎలా నియమించాలి, అర్హతలను ఎవరు నిర్ణయించాలి వంటి ప్రాథమిక అంశాలే చర్చకు వస్తున్నాయి. వీటన్నింటిపైనా వివరణ ఇవ్వగలిగింది సుప్రీం కోర్టు మాత్రమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొక్కాని నిర్ణయించింది.

-ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*