నిమ్మగడ్డ రమేష్‌ తాను తీసిన గోతిలో తానే పడుతున్నారా..!

రాష్ట్ర ఎన్నిక సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మెల్లగా కష్టాల్లో చిక్కుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన పంతాలకు పోయి…. ఇబ్బందులు కొనితెచ్చుకుంటున్నట్లు అనిపిస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాసినట్లు చెబుతున్న లేఖ విషయంలో నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు ఇక్కట్లు తప్పేలాలేవు.

నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ రాసినట్లు చెబుతున్న లేఖపై వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలోని అంశాలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని అప్రదిష్టపాలు చేసేలా ఉన్నాయని, అది రమేష్‌ కుమార్‌ రాసిన లేఖ కాదన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపైన సిఐడి విచారణ మొదలుపెట్టింది. కీలక అంశాలను వెలికి తీస్తోంది.

మార్చి 15 ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ లేఖపై నిమ్మగడ్డ నోరు మెదపలేదు. తాను రాశాననిగానీ రాయలేదనిగానీ చెప్పలేదు. తీరా విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశాక…తానే రాశానని నిమ్మగడ్డ చెప్పినట్లుగా పత్రికల్లో వార్తలొచ్చాయి. అది కూడా ఎక్కుడా రాతపూర్వక ప్రకటన ఇవ్వలేదు. ఇంతలోనే ఆయన పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే.

ఈ లేఖకు సంబంధించి సిఐడి విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లేఖను లాప్‌టాప్‌లో తయారు చేసి, పెన్‌ డ్రైవ్‌ ద్వారా డస్క్‌టాప్‌లోకి వేసి, ప్రింట్లు తీసి, కమిషనర్‌తో సంతకాలు చేయించి, తరువాత దాన్ని స్కాన్‌చేసి, నిమ్మగడ్డ వాట్సాప్‌కు పంపగా, ఆయన తన ఫోన్‌ ద్వారా కేంద్రానికి పంపినట్లుగా రమేష్‌ కుమార్‌ వద్ద పని చేసిన అధికారి ఒకరు సిఐడికి వ్లెడిరచారు. ఇక్కడ చేసిన తప్పేమిటంటే…. కంప్యూటర్‌లో డేటా మొత్తాన్ని డిలీట్‌ చేసి, మూడుసార్లు ఫార్మేట్‌ చేయడం, లాప్‌టాప్‌నూ ఫార్మేట్‌ చేయడం, పెన్‌ డ్రైన్‌ను ధ్వంసం చేయడం.

ప్రభుత్వ కార్యాయానికి సంబంధించిన కంప్యూటర్లను ఎందుకు ఫార్మేట్‌ చేయాల్సివచ్చింది అనేది ప్రశ్న. ఆధారాలు దొరక్కుండా చేయడం కోసమే ఇదంతా చేశారని, ఇది నేరంగా పరిగణించ బడుతుందని న్యాయనిపుణు చెబుతున్నారు. అసలు ఆ లేఖను రమేష్‌ కుమార్‌ కార్యాయంలో సిద్ధం చేయలేదని, ఎక్కడో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రెడీచేసి పంపించారని, అవన్నీ బయటపడుతాయన్న ఉద్దేశంతోనే కంప్యూటర్‌ను, లాప్‌టాప్‌ను ఫార్మేట్‌ చేశారన్న అనుమానాలు  వ్యక్తమవు తున్నాయి.

ఎంత ఉన్నత స్థానంలో పనిచేసిన అధికారి అయినా….అధికారిక లావాదేవీలు, వ్యవహారాల విషయంలో ఇలా చేయడం నేరమే అవుతుంది. ఆఫీసులోని ఫైళ్లను దగ్ధం చేయడం ఎంత నేరమో….డిజిటల్‌ యుగంలో కంప్యూటర్‌ను అనవసరంగా ఫార్మేట్‌ చేయడం, పెన్‌డ్రైవ్‌ను నాశనం చేయడం కూడా అంతే నేరం అవుతుంది.

ఆ లేఖలోని అంశాలకంటే…ఈ చర్యలే రమేష్‌ కుమార్‌ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నాయి. రమేష్‌ కుమార్‌పైన సిఐడి కేసు నమోదు చేసే అవకాశం లేకపోలేదు. కంప్యూటర్ , ల్యాప్‌టాప్ నుంచి డిలీటైన సమాచారాన్ని రికవరీ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ డేటా చేతికందితే ఇంకా అనేక విషయాలు బహిర్గతం అవుతాయి. ఏదిఏమైనా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చేసిన పనుల వల్ల రమేష్‌ కుమార్‌ పరిస్థితి….తాను తీసిన గోతిలో తానే పడినట్లు అయింది. తన తొలగింపు‌ అన్యాయమని హైకోర్టులో వేసిన వ్యాజ్యం కొనసాగుతున్న సమయంలోనే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఈ కేసు ఇంకా ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
– ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*