నిమ్మగడ్డ రహస్య సంబంధాలకు బలమైన ఆధారాలు..!

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన తెలుగుదేశం పార్టీ చెప్పుచేతుల్లో ఉంటూ పనిచేస్తున్నారని అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు బలమైన ఆధారాలు బయటపడ్డాయి.

తెలుగుదేశం పార్టీలో ఉంటూ, రాజ్యసభ ఎంపిగా ఉండి, మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత జిజెపిలో చేరిన సుజనా చౌదరిని, తెలుగుదేశం మూలాలున్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాసును నిమ్మగడ్డ రమేష్ కుమార్…రహస్యంగా ఓ స్టార్ హోటల్ లో కలిసిన సిసి పుటేజీ దృశ్యాలు బహిర్గతమయ్యాయి.

ఈనెల 13వ తేదీన సుజనా చౌదరి, కామినే‌‌ని‌ శ్రీనివాస్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోటల్ లో సమావేశమై గంటకుపైగా చర్చించిన సంగతులు బయటపడ్డాయి.

అసలు ఈ ముగ్గురూ రహస్యంగస కలవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. సుజనా, కామినేని కలిసినా…వారిద్దరు బిజెపి నాయకులు కాబట్టి కలిశారని‌ అనుకోవచ్చు.‌ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్నగడ్డ..ఆ ఇద్దరితో కలవాల్సిన అవసరం ఏముంది, కలిసి ఏం చర్చించారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సుజనా చౌదరి బీజేపీలో చేరినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ మనిషి అన్న విషయం తెలిసిందే. ఆయన బీజేపీలో ఉంటూ చంద్రబాబునాయుడి ప్రయోజనాల కోసం పని చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడే సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులను బిజెపిలోకి పంపించారని చెబుతారు. అదేవిధంగా కామినేని శ్రీనివాస్ 2014 ఎన్నికల్లో బిజెపి తరఫున గెలిచి, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా ఆయన బిజెపి ప్రయోజనాల కంటే టిడిపి ప్రజల కోసం పని చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వివాదాన్ని ఎదుర్కొంటున్న సమయంలో నిమ్మగడ్డ… ఇటువంటి నాయకులను ఎందుకు కలిశారనేది అది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారిన‌ అంశం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా వింటూ, వైసీపీకి వ్యతిరేకంగా… ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు బయటపడినా సంబంధాలు ఆ ఆరోపణలను బలోపేతం చేసేలాగా ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు సుప్రీం కోర్టులో ఉంది. కోర్టులో గెలుస్తారా ఓడిపోతారని దాంతో నిమిత్తం లేకుండా… ఈరోజు బయటపడ్డ రహస్య సంబంధాలు మాత్రం ఆయన నిజాయితీని ప్రశ్నార్థకం చేశాయనే చెప్పాలి. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*