నిర్మలా సీతారామన్ ను మెత్తగా, శుభ్రంగా ఉతికేసిన అజేయ కల్లం..!

కేంద్ర అర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక మాట అన్నారు. ‌కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూ.2.70కి విక్రయిస్తుంటే… దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమలకు రూ.9కు విక్రయిస్తున్నట్లు విన్నాను. రాష్ట్ర ప్రజలు ఎలా బతుకుతున్నారో ఏమో..అని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం స్పందించారు. ఆమె చెప్పినవన్నీ‌ అసత్యాలని తేల్చేశారు. కేంద్ర ప్రభుత్వం యూనిట్ రూ.2.70కు ఎక్కడ ఇస్తోందో తెలియడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు యూనిడ్ రూ.7.65కు ఇస్తోందని వివరించారు. దీనిపైనా రూపాయి సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. వాస్తవంగా పరిశ్రమకు రూ.6.65కు ఇస్తున్నట్లు ‌అవుతుందన్నారు. అయితే…రూ.9 ఇస్తున్నట్లు ఆమెకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని వివరించారు.

అదేవిధంగా కేంద్రం రూ.2.70కే విద్యుత్ ఇస్తుందనడంలోనూ నిజం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుంచి సగటున రూ.4.80 కి కొంటున్నట్లు చెప్పారు. ఎన్టీపీసీ రూ.9.84కు ఇస్తోందని, వద్దన్నా ఈ విద్యుత్‌ను ఏపీకి అంటగడుతున్నారు. బయట తక్కువకు‌ దొరుకుతున్నా కొనలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ఖర్చు సగటున రూ.6.80 అవుతోందని రెగ్యులేటరీ కమిషన్ తేల్చిందన్నారు. గత ప్రభుత్వం…అధిక ధరలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తోందన్నారు. వీటిని రద్దు చేయడానికి వీల్లేదని కేంద్రమే చెబుతోందన్నారు.

కేంద్ర అర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కు ఈ విషయాలు తెలియవని అనుకోలేం. అయినా ఆమె‌ ఎందుకలా మాట్లాడారు..? ఆమె భర్త తెలుగుదేశం ప్రభుత్వంలో‌ సలహాదారునిగా ఉన్నారు. అప్పుడూ ఇదే విద్యుత్ ఛార్జీలు ఉన్నాయి. మరి‌ ఇటువంటి విమర్శలు అప్పుడెందుకు చేయలేని వైసిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. సీతారామన్ కూడా బిజెపిలో ఉంటూ టిడిపి కోసం పనిచేసే సీక్రెట్ లీడర్ గా ఏమైనా మారారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*