నూతన్ నాయుడు భుజానికి గాయం…బిగ్ బాస్ ఇంటి నుంచి అవుట్..!

బిగ్ బాస్ ఇంటి నుంచి రెండో వారానికే జయటకు వచ్చి…అనూహ్య పరిణామాలతో మళ్లీ ఇంటిలోకి ప్రవేశించిన నూతన్ నాయుడు అంతే అనూహ్యంగా రెండోసారి ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఓ టాస్క్ ఆడుతుండగా భుజానికి బలమైన గాయం‌ అవడంతో చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి పంపించారు.‌

కెప్టెన్ ఎంపిక కోసం బిగ్ బాస్ పడగొట్టు…నిలబెట్టు టాస్క్‌ ఇచ్చారు. ‌పోటోలో ఉన్న కౌశల్, రోల్ రైడా తమకు ఇచ్చిన తేలికపాటి పెట్టెలతో పిరమిడ్ నిర్మించాలి. మతకు నచ్చిని వ్యక్తి పిరమిడ్ ను మిగతా సభ్యులు రబ్బరు బంతులతో‌‌ పడగొట్టాలి. ఆ విధంగా రోల్ పైకి బంతులు విసురుతుండగా ఒక్కసారిగా నూతన్ భుజం గట్టిగా పట్డుకుని కిందపడిపోయారు. వైద్యులు అతన్ని పరీక్షించి భుజాని తీవ్ర గాయమైనట్లు చెప్పారని బిగ్ బాస్ వెల్లడించారు. చికిత్స కోసం నూతన్ ను ఆస్పత్రి కి పంపుతున్నట్లు బాస్ ప్రకటించారు. ఈ విధంగా నూతన్ రెండోసారి బయటకు వచ్చారు.

ఇదంతా వాస్తవమా…నాటకీయత కోసం ముందస్తు స్క్రిప్ట్ లో భాగంగా ఇదంతా చేశారా అనే అనుమానాలూ వస్తున్నాయి. ఎందుకంటే ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుందని బిగ్ బాస్ ప్రకటించినా నూతన్ పెద్దగా ఆశ్చర్యపోలేదు. పైగా రెండు రోజులుగా అతని వ్యవహార శైలి కొత్తగా ఉంది. అందరినీ‌ కలుపుకుని పోవాలి అనే ధోరణిలో మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యం గా అనిపించింది. ఇంతలో నూతన్ నాటకీయంగా బయటకు వెళ్లారు.

అసలు పాత సభ్యులను తిరిగి ఇంటిలోకి‌ పంపినపుడే చాలా మందికి అనుమానం వచ్చింది. నూతన్ లోనికి ఎలా వెళ్లగలిగారు, తేజస్వీకి, భానుకి ఆయనకంటే ఎక్కవ ఓట్లు వచ్చివుండాలి… కానీ నూతన్ వాళ్లారు. ఇలాంటి హ్యూహంలో భాగంగానే ఆయన్ను పంపారా అనే‌ అనుమానాలూ లేకపోలేదు. ఎదేమైనా ఇది వాస్తవమా….డ్రామానా అనేది ఆలస్యంగానైనా బయటకు వస్తుంది.

ఇక ఈ వారం రోల్ రైడా కెప్టెన్ గా ఎంపికయ్యారు. టాస్క్ లో ఎక్కవ మంది రోల్ కు అనుకూలంగా నిలబడ్డారు.‌ కౌశల్ పిరమిడ్ ను ఎక్కువ సార్లు పడగొట్టారు. కౌశల్ దాదాపు ఒంటరి అవుతున్నారు. తోడుగా ఉన్న నూతన్ కూడా బయటకు వెళ్లడం కౌశల్ కు కాస్త ఇబ్బందే అని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*