నేనున్నాను…ధైర్యంగా వుండండి…కోవిడ్ బాధిత పోలీసులకు ఎస్పీ రమేష్ రెడ్డి భరోసా..!

విధి నిర్వహణలో వుంటూ, కరోనా బారిన పడిన పోలీసులకు ‘నేనున్నాను…ధైర్యంగా వుండండి’ అంటూ చెప్పారు తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి. వైరస్ సోకి చికిత్స పొందుతున్న పోలీసు సిబ్బందిని ఆయన జూమ్ ఆప్ ద్వారా పరామర్శించారు.‌

ఈ‌ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అడ్మిన్ అడిషనల్ యస్.పి గారికి కానీ, పోలీసు మెడికల్ డాక్టర్ ని కానీ, కోవిడ్ -19 ఇన్చార్జ్ ని కానీ, పోలీసు అసోసియేషన్ వారికి కానీ తెలియపరచాలని సూచించారు. చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి అవసరం వచ్చినా వెంటనే స్పందించాలని పోలీసు‌ అధికారులను‌ అదేశించారు.

అన్నీ సవ్యంగా వున్నాయని, తాము దైర్యంగా ఉన్నామని, అధికారులు అనుక్షణం తమ బాగోగులు చూస్తున్నారని ఐసొలేషన్ లో ఉన్న సిబ్బంది తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లాలో రెండు వేల మంది పోలీసులు వుండగా…దాదాపు 170 మంది దాకా కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సిబ్బందిలో మనో ధైర్యం నింపేందుకు ఎస్పీ రమేష్ రెడ్డి ఈ కార్యక్రమమం నిర్వహించారు. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*