న్యాయదేవత పవిత్రతపై అనుమానం రేకెత్తించే రాతలు…!

వైపిపి అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ఉన్న అక్కసుతో, కోర్టులను, న్యాయమూర్తును రాజకీయాల్లోకి లాగి, బజారుకీడ్చి….ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల దురభిప్రాయం కలగడానికి కారణమ వుతున్నాయి ఆ పత్రిక రాతలు. ఎవరో న్యాయవ్యవస్థపై కుట్రలు చేస్తున్నారని చెప్పడానికి….రోజూ కోర్టులు, న్యాయమూర్తుల పేరుతో వివాదాస్పద అంశాలను పతాక శీర్షికకు ఎక్కిస్తోంది. దీని ద్వారా ఎవరో న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారని ప్రచారం చేలయాని భావిస్తోందిగానీ…వాస్తవంగా కోర్టు పవిత్రతను ఆ పత్రికే మంటగుపుతోంది. కోర్టుపై జనంలో అనేక అనుమానాలు రేకెత్తడానికి కారణమవుతోంది.

తెలుగుదేశం పార్టీకి, వైసిపికి మధ్య రాజకీయ సంఘర్షణ ఎప్పుడో పరిధులు దాటింది. ఈ రెండు పార్టీలూ…రాజకీయ ప్రత్యర్ధుల్లా కాకుండా, బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వ్యవహారాల్లో కొన్ని మీడియా సంస్థలూ భాగస్వాముగా మారిపోయిన పరిస్థితి దాచేస్తే దాగేది కాదు. గత ఎన్నికల్లో 23 స్థానాలకు పరిమితమై, ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ…. ఇప్పుడు న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వ కాళ్లకు బందేలు వేయాలని చూస్తోంది. అందుకే ప్రతి అంశంపైనా కోర్టులో కేసులు వేయిస్తోంది. కోర్టు తమ విచక్షణ మేరకు తీర్పులు ఇస్తున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

నిర్ణయాలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నట్లే…అవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే అడ్డుకునే అధికారం కోర్టుకు ఉంది. ఇది చాలా సహజమైన అంశం. ఎన్ని కేసులైనా ఓడిపోవచ్చు. ఒక కేసులో ఓడిపోయినంత మాత్రాన ఇంకో కేసులో కోర్టుకు వెళ్లకూడదని ఏమీ లేదు. జగన్‌ ప్రభత్వానికి పలు కేసుల్లో ఎదురుదెబ్బలు తగిలిన మాట వాస్తవం. అంత మాత్రాన నిర్ణయాలు తీసుకోవడం మానేయదు. ఇది నిరంతరం జరిగేదే.

అయితే….కోర్టు ఎన్నిసార్లు చెబుతున్నా లెక్కలేదా అనేది కొందరి వాదన. న్యాయస్థానాలను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని కొందరు చెబుతున్న భాష్యం. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, కోర్టుకు మధ్య విభేదాలు సృష్టించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టును, న్యాయమూర్తులను రెచ్చగొడుతున్నారు. న్యాయమూర్తుల్లో ముఖ్యమంత్రి జగన్‌పై వ్యతిరేక భావన సృష్టించడానికి యథాశక్తి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే రోజుకో కథనం వండి వార్చుతున్నారు.

ఆదివారం ఆ పత్రికలో రాసిన వ్యాసంలో ఓ మాట రాశారు…‘ముఖ్యమంత్రులు తరచూ హైకోర్టు న్యాయమూర్తును కలిసి ప్రభుత్వంలో ఏం జరుగుతోందో వివరించేవారు. ఇప్పటికీ కెసిఆర్‌ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. జగన్‌ మాత్రం లెక్కచేయడం లేదు’ అని రాసుకొచ్చారు. ఈ వాక్యం చదివితే…..జగన్‌ అలా వెళ్లి చెప్పకపోవడం వల్లే న్యాయమూర్తులు కోపంగా ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని పాఠకులకు అర్థమవుతుంది. ఇది న్యాయస్థానాలపైన, న్యాయ మూర్తుపైన ప్రజల్లో దురభిప్రాయం కలిగించడం కాదా…!

కోర్టు స్వతంత్ర వ్యవస్థ. ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాని న్యాయమూర్తులు ఎందుకు అనుకుంటారు? అసలు న్యాయమూర్తులు తరచూ ప్రభుత్వ పెద్దలను కుసుకోడానికి…. న్యాయ వ్యవస్థలోని నిబంధనలు అంగీకరిస్తాయా? అలా కలుసుకుంటే ఇక స్వతంత్రతకు అర్థమేముంటుంది? నిష్పక్షపాతకత ఎలా వస్తుంది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తే…అప్పుడు న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా తీర్పు ఇవ్వగలరా? ప్రభుత్వ పెద్దలు, న్యాయమూర్తులు తరచూ కలుసుకోవాలని చెప్పడం న్యాయవ్యవస్థ నిబంధనలను ఉల్లంఘించమని చెప్పడం కాదా..! ఇలాంటి పద్ధతి నిజంగానే ఉంటే….జనం ఏమనుకుంటారు? ప్రభుత్వం, కోర్టు రెండూ ఒకటే అనుకోరా?

ఆ వ్యాసంలో ఇంకో ఉదంతం కూడా రాశారు…ఎప్పుడో ఒకసారి న్యాయమూర్తులు…జగన్‌ను కవడానికి వెళ్లారట. న్యాయమూర్తుల వాహనాలను గేటు వద్దే ఆపేశారట. అక్కడ దిగి నడచి వెళ్లారట. ఈ ఉదంతంతో న్యాయమూర్తుల్లో ముఖ్యమంత్రి జగన్‌పై కోపం ఉందని సదరు వ్యాస రచయిత చెప్పదచుకున్నారా? ఇటువంటి చిన్నా చితకా విషయాను న్యాయమూర్తులు పట్టించుకుంటారా? జడ్జీలకు ఇది గుర్తుందో లేదోగానీ…కార్లు గేటు వద్ద ఆపేయడం వల్ల జడ్జీలు జగన్ మీద కోపంతో ఉన్నారన్న భావన ఈ కథనం కలిగిస్తుంది. ఇది న్యాయమూర్తులను ప్రజల్లో పచన చేయడం కాదా?

రాష్ట్ర హైకోర్టులో ఆరుగురు న్యాయమూర్తుల సెల్‌ఫోన్లు హ్యాక్‌ అయ్యాయన్నది మరో కథనం. న్యాయమూర్తుల ఫోన్లకు ఏదో మెసేజ్‌ వచ్చిందని, ఆ లింకు ఓఫోన్‌ చేయగానే ఫోన్లు టాప్‌ అయ్యాయని, జడ్జీలపైన నిఘా పెట్టారన్నది ఆ కథనం సారాంశం. ఇది నిజమే అయితే….న్యాయమూర్తులే స్వయంగా విచారణకు ఆదేశించేవారు కదా? కోర్టు ఆదేశిస్తే…సిబిఐ వంటి సంస్థలే రంగంలోకి దిగి విచారణ చేపడతాయి. అందులోని నిజానిజా నిగ్గు తేల్చుతాయి. ఫోన్ల ట్యాపింగ్‌ వంటి తీవ్రం నేరం జరిగినట్లు అనుమానం వస్తే న్యాయమూర్తులు కచ్చితంగా ఇటువంటి విచారణకు ఆదేశించేవారు కదా? ఇదే ఇప్పుడు ప్రజకు కలుగుతున్న అనుమానం.

నిజంగానే జడ్జీలు తమ ఫోన్లు ట్యాపింగ్‌ జరిగాయని భావించి, ఎవరో నిపుణును పిలిపించి తనిఖీ చేయించుకుంటే….ఆ సంగతి సదరు మీడియాకు ఎలా తెలుస్తుంది? కోర్టు ఛాంబర్‌లోనో, ఇంట్లోనో జరిగే విషయాలు బయటకు రావడం అంత తేలిక కాదు. జడ్జీలు చెబితే తప్ప బయటకు రావు. న్యాయమూర్తులు ఏదైనా చెప్పదచుకుంటే మీడియా మొత్తాన్ని పిలిచి చెబుతారు తప్ప….ఒకరికి మాత్రమే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పరు. అయితే ఆ పత్రిక మాత్రం జడ్జీ ఛాంబర్‌లో ఏం జరిగిందో తానే స్వయంగా చూసినట్లు రాసింది. తమకు అందిన సమాచారానికి ఆధారం ఏమిటో కూడా చెప్పలేదు. ఏదో గాలి విషయాను వండివార్చి, పతాక శీర్షికల్లో వార్తలుగా వేస్తే….దానివల్ల ప్రజల్లో పలచనయ్యేది ఎవరు?

కోర్టులపై ఎవరో కుట్రలు చేస్తున్నారని ప్రజను నమ్మించడానికి…. న్యాయ వ్యవస్థతోనే చెగాటం అడుతోంది. కుట్రలు చేస్తున్నారని చెబుతున్నవారి వల్ల న్యాయవ్యవస్థ ఏమేరకు అప్రతిష్టపావుతున్నదో తెలియదుగానీ…ఈ కథనాతో మాత్రం కచ్చితంగా ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు కుగుతున్నాయన్న మాట వాస్తవం. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయదు. ఆ మాటకొస్తే వైసిపి నేతలు, కార్యకర్తలు కొందరు సామాజిక మాధ్యమాల వేదికగా కోర్టుపైన, న్యాయమూర్తులపైన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వ్యవహారాలనూ ఎవరూ ఆమోదించరు. ఎవరైనా సరే…. న్యాయ వ్యవస్థను, న్యాయమూర్తును రాజకీయాల్లోకి లాగడం మానేయాలి. న్యాయదేవతకు ఉన్న పవిత్రను పదికాలా పాటు కాపాడుకోవాలి. ఇప్పటికైనా ఈ వ్యవహారాలకు తెరపడాలంటే హైకోర్టు సమగ్ర విచారణకు ఆదేశించాలి.

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*