పగతో రగిలిపోతూ అతన్ని కసిగా చంపి రక్తం తాగాడు..! ఎందుకు‌…ఎక్కడ..!!

మనిషిని చంపడం కాదు…రక్తం కళ్ల చూడటం కాదు…క్రూరంగా చంపి, రక్తం‌ తాగాడు. ఆ విధంగా తన కసి, కోపం, పగ తీర్చుకున్నాడు. ఈ ఘటన మహా నగరమై‌న బెంగుళూరులో జరిగింది. ఇంతకీ అంత క్రూరంగా చంపింది ఎవరు.. ఎవర్ని… ఎందుకు.. !

బెంగుళూరుకు చెందిన తబ్రేజ్‌ అనే వ్యక్తి భార్యను సుభాన్‌ అనే వ్యక్తి లోబర్చుకున్నాడు. అమెను తమకూరుకు తీసుకెళ్లి  సంసారం పెట్డాడు. దీంతో తబ్రేజ్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుభాన్‌ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు మిత్రులతో కలిసి సభాన్ ను అపహరించి బెంగుళూరుకు తీసుకొచ్చారు. అతన్ని చిత్రహింసలు పెట్టి, కొట్టి, చంపి డీజేహళ్లి పోలీసుస్టేషన్‌ వద్ద పడేశారు.

ఈ కేసు దర్యాప్తులో దారుణ నిజాలు జయటపడ్డాయి. మొదట పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తబ్రేజ్‌ భార్యను విచారించారు. ఆమె అసలు విషయం చెప్పింది. తబ్రేజ్‌తో కలిసి ఉండలేక తాను సుభాన్ తో వెళ్లిపోయినట్లు చెప్పింది. దీంతో పోలీసులు తబ్రేజ్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను దిగ్భ్రాంతి కలిగించే విషయాలు చెప్పారు. తన స్నేహితులతో కలిసి సుభాన్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసినట్లు తబ్రేజ్‌ పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. తన భార్య తీసుకేళ్లిన సుభాన్‌ను హత్య చేయటమేకాదు. అతడి రక్తం కూడా తాగినట్లు తబ్రేజ్‌  వెల్లడించాడు. దీనితో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. తబ్రేజ్‌తో పాటు అతడి స్నేహితులు నిజామ్, అలీ అండులను అరెస్ట్‌ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*