పత్రికల ద్వారా కరోనా వ్యాపించదట…! జనం‌ ఈ వార్తను నమ్ముతారా…!!


వార్తా పత్రికల‌‌ ద్వారా కరోనా సోకదని అసోంకి చెందిన ప్రముఖ వైద్యులు చెప్పినట్లు ప్రముఖ దినపత్రక ఓ వార్తను ప్రచురించింది. అయితే…కరోనాని వ్యాప్తి చేయని గుణం వార్తా పత్రికలకు ఏముందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి వార్తా పత్రికలను తాకితే…ఆ పత్రికను చేతపట్టుకుని చదివిన వ్యక్తికి కూడా కరోనా వస్తుంది. కాగితంపైన కూడా వైరస్ కొన్ని గంటలపాటు జీవించివుంటుందని వైద్య శాస్త్రవేత్తలే చెబుతున్నారు. మరి‌ వార్తాపత్రిక కాగితం కదా…దానిపైకి చేరిన వైరస్ ఇతరులకు సోకదా… ఈ చిన్న తర్కానికి కూడా ఆ వార్తలో లేదు.

కరోనా నేపథ్యంలో పాల ప్యాకెట్లను కూడా కడిగి ఇంట్లోకి‌ తీసుకెళ్లమంటున్నారు. కొరియర్ వంటివి వస్తే ఒక రోజంతా వాటిని తాకకుండా బయటే ఉంచేసి, తరువాత తీసుకోమంటున్నారు. అయితే…వార్తాపత్రికల ద్వారా కరోనా సోకదని చెబుతున్నారు. ఇటువంటి భరోసా ఎలా ఇవ్వగలరో ఆ డాక్టర్ గారు కూడా చెప్పలేదు.

కరోనాకు భయపడి చాలామంది వార్తాపత్రికలను తీసుకోవడం ఆపేస్తున్నారు. ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు. దీంతో సర్క్యులేషన్ దారుణంగా పడిపోతోంది. ఇది పత్రికాధిపతులను కలవరపెడుతోంది. ఆన్ లైన్‌లో చదువుకోవటం‌ అలవాటును చేసుకుంటే కరోనా ముప్పు తప్పిన తరువాత కూడా సర్క్యులేషన్ పెరగకపోవచ్చు. అదే జరిగితే దాని ప్రభావం కార్పొరేట్ ప్రకటనలపై పడుతుంది. ఈ పూర్వరంగంలోనే‌ ఈ వార్తను అర్థం చేసుకోవాలన్నది సీనియర్‌ జర్నలిస్టుల ఉవాచ.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*