పనికిరాని వేదిక…మైకులూ కరువే ఇక్కడ..! యూత్ ఫెస్టివల్ తీరిది..!!

శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాల యంలో జరుగుతున్న సౌత్ జోన్ యూత్ ఫెస్టివల్ లో నిర్వహణా లోపాలు పార్టిసిపెంట్స్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దక్షిణ భారత దేశంలోని 36 యూనివర్సిటీ ల నుండి 1200 మందికిపైగా విద్యార్థులు వివిధ అంశాల్లో తమ ప్రతిభను ప్రదర్శించడానికి తరలివచ్చారు. నృత్యం, సంగీతం, నాటకం, డ్రాయింగ్ తదితర అంశాల్లో తమ ప్రతిభను చాటుకోడానికి ఉత్సాహం గా వచ్చారు. ఇటువంటి వాటికి అవసరమైన వేదకలు, మైకులు కూడా సక్రమంగా ఏర్పాటు చేయలేకపోయారు.

ఏకాంకిక నాటికలు – వన్ యాక్ట్ ప్లే ప్రదర్శించడం కోసం ఏర్పాటు చేసిన వేదిక అందుకు అనుకూలంగా లేదు. నాటకాల ప్రదర్శన లో లైటింగ్ ఎఫెక్ట్్స కీలక పాత్ర పోషిస్తాయి. సరైన లైటింగ్ తోనే సన్నివేశాలు రక్తికడుతాయి. పగటిపూట నాటకాలు ప్రదర్శిం చాలంటే బయట వెలుతురు పడని థియేటర్ ఉండాలి. రాత్రివేళల్లో అయితే ఓపెన్ థియేటరైనా సరిపోతుంది. కానీ ఇక్కడ వన్ యాక్ట్ ప్లేకి పగటిపూట షెడ్యూల్ నిర్ణయించారు. కానీ ఓపెన్ థియేటర్ కేటాయించారు. ఇందులో తాము పగటిపూట ప్రదర్శనలు ఇవ్వడానికి విద్యార్థులు నిరాకరించారు. దీంతో సాయంత్రం 5.30 గంటలకు షెడ్యూల్ మార్చారు. పత్రికల్లో వచ్చిన పాత షెడ్యూల్ చూసుకుని ప్రదర్శనలను తిలకించడానికి వచ్చినవారు నిరాశకు గురయ్యారు.

ఇక సావేరి సెమినార్ హాలు లో (వేదిక -3 ) సంగీత పోటీలు నిర్వహించారు. ఇక్కడ స్టాండిగ్ మైక్ కరువయింది. దీంతో ఒకరు మైక్ పట్టుకుంటే ఇంకొకరు పాడాల్సిన దుస్థితి ఏర్పడింది. కీబోర్డు, గిటార్ వంటి పరికరాలను మైక్ కు కనెక్ట్ చేయడానికి అవసరమైన కేబుల్ కూడా లేదు. ఇటువంటి ప్రదర్శనలకు మైస్ కనీస అవసరం. అదే సరిగా లేకపోడంతో ప్రదర్శకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక పద్మోత్సవ్ లో వడ్డిస్తున్న భోజనాలపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ రుచులను వివిధ రాష్ట్ర ప్రతినిధులకు పరిచయం చేయడాని ఇదో మంచి అవకాశం. కానీ అతి సాధారణ భోజనంతో సరిపెట్టేశారు. శుభ్రత విషయంలోనూ ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్లేటుపై ఆకు కూడా వేయకుండా భోజనం పెట్టడం తినేవారికి ఇబ్బందిగా ఉంది.

ఇటు వంటి చిన్నచిన్న లోపాలు లేకుండావుంటే ఉత్సవాలు మరింత అలరించివుండేవి. అనుభవజ్ఞులతో
ముందస్తుగా చర్చించివుంటే ఇటువంటి లొపాలు తలెత్తివుండేవి కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*