పరమ చెత్త ఎపిసోడ్…విందూలేదు బొందాలేదు!

బోర్, సుత్తి, చావగొట్టుడు…వంటి పదాలకు అర్థం ఏమిటో బిగ్ బాస్ షో 23 వ రోజు ఎపిషోడ్ చూస్తే అర్థమవుతుంది. షోను రసకందాయంలో పడేసారని అనుకున్న మర్నాడే పరమ చెత్త షో అనిపించాడు బిగ్ బాస్. మంగళవారం రాత్రి ప్రసారమైన ఎపిషోడ్ లో నయాపైసా వినోదం లేదు. ఎంతసేపూ నందిని ఏడపుతోనే సరిపోయింది. భానుని నందిని ఎప్పుడో ఏదో అన్నదట…ఎప్పుడు ఏమన్నదో కూడా ప్రేక్షకులకు గుర్తులేదు…ఆ అంశంపై వాదనలతో ఎపిషోడ్ ముగించారు.

దీనికి ముందురోజు హమిద్, తనిష్ లకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తిచేస్తే ఇంటి నభ్యులందరికీ మంచి విందు ఇస్తానని బిగ్ బాస్ హామీ ఇచ్చారు. టాస్క్ పూర్తి చేసినా తలొక ఫిజా ముక్క, నాలుగు జల్లీలు తప్ప విందూలేదు… బొందాలేదు.

లగ్జరీ బడ్జెట్ టాస్క్ గా స్టూడెంట్ హాస్టల్ ఆట చివర్లో మొదలుపెట్టారు. వేరువేరు హాస్టళ్లలో ఉంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు కలుసుకునేందుకు, ప్రేమ లేఖలు ఇచ్చుకునేందయకు ప్రయత్నిస్తుంటే వార్డన్లు, వాచ్ మెన్లు అడ్డుకోవాలట. ఇది ఎంతవరకు ఆకట్టుకుంటుందో బుధవారం నాటి ఎపిషోడ్ లో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*