పవన్‌ కల్యాణ్‌ తన తొలి అభ్యర్థిని ప్రకటించారు!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పూర్తికాలం రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రమంతా పర్యటిస్తూ కొత్త సమీకరణలకు తెరతీశారు. ఆయన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేస్తుంది, ఎవరితో కలిసి పోటీ చేస్తుంది అనే అంశాలను పక్కనపెడితే…జనసేన తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం అభ్యర్థిగా పితాని బాలకృష్ణ ఉంటారని చెప్పారు. ఆయన్ను పార్టీలో చేర్చుకున్న సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ…బాలకృష్ణ తనను కలిసి పార్టీలో చేరుతానని అడిగారని, తాను సీటు ఇస్తానని హామీ ఇవ్వకపోయినా పార్టీలో చేరారని అన్నారు. జనసేన నుంచి బి-ఫారం అందుకునే తొలి అభ్యర్థి పితాని బాలకృష్ణనే అని పవన్‌ ప్రకటించారు.

రాజకీయాలు ఊపందుకుంటున్న క్రమంలో పవన్‌ కల్యాణ్‌ కూడా నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే చాలామంది ఆశావహులున్నారు. సీటు గ్యారెంటీ అంటే జనసేనలో చేరాలని ఆలోచిస్తున్నవారు ఉన్నారు. అయితే…పవన్‌ మాటలను బట్టి సీటుకు ముందుగా గ్యారెంటే ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఏ నియోజకవర్గం నుంచి ఎవరికి సీటు ఇవ్వాలి అనేది ఇప్పటికే పవన్‌కు స్పష్టత ఉందని, సర్వేలు ద్వారా వివరాలు తెప్పించుకున్న ఆయన సందర్భం వచ్చినపుడు అభ్యర్థులను ప్రకటిస్తారని అంటున్నారు. పవన్‌ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులు ఎవరనేది అన్ని ప్రాంతాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*