పవన్‌ చేసిన మహాపాపం ఏమిటి?

కాపుల రిజర్వేషన్ల కోసం నిర్విరామ పోరాటం సాగిస్తున్న ముద్రగడ పద్మనాభం పవన్‌ కల్యాణ్‌ విషయంలో స్పందించారు. పవన్‌ కల్యాణ్‌ను నిందిస్తూనే….ఆయనకు కర్తవ్య బోధ చేశారు. కొన్ని టివి ఛానళ్లతో కలిసి నారా లోకేష్‌ కుట్రపన్నారని పవన్‌ ఆరోపించిన తరువాత రెండో రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముద్రగడ ఓ లేఖను పవన్‌కు రాశారు. ఈ ప్రభుత్వంలో తనకూ, తన కుటుంబానికీ తీవ్రమైన అవమానం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలోని కొన్ని వాక్యాలు…

కాపు జాతీకి బిసి రిజర్వేషన్‌ కల్పిస్తానని ఆయన (చంద్రబాబు) ఇచ్చిన హామీని నెరవేర్చమని దీక్ష చేస్తుంటే…నా శ్రీమతిని, నా కోడలని, రెక్కపట్టుకుని ఈడ్చుకెళ్లారు. రావే….లం….జ, మిమ్మల్ని కొడితే దిక్కెవరే లం…జ’ అంటూ దూషించారు. అటు వంటి దుర్మార్గున్ని మీరు భుజాలకెత్తుకున్నారు. ఊరూరా తిప్పుతూ అపర మేధావి అని, పరిపాలనా ధక్షుడని పొగడ్తలతో ముంచెత్తుతూ…పట్టాభిషేకం చేయించి….ప్రజల సొమ్మును దొరినిన కాడికి తోచుకు తినమని రోడ్డుమీదకు పంపి మహా పాపం చేశారు. ఈ పాపం ఎన్ని నదుల్లో మీరు స్నానం చేసినా పోదన్న సంగతి గుర్తు చేస్తున్నాను.

అని ఒక పేరాలో రాశారు. అదేవిధంగా ముగింపులో….

మీరు మీ కుటుంబానికి జరిగిన అవమానంపై కేసుపెట్టి, కోర్టుకు వెళ్లాలని భావిస్తున్నట్లు విన్నాను. ఆ ప్రయత్నం చేయకండి. వారి పార్టీని గోదావరిలో కలపడానికి ప్రయత్నించండి. సముద్రగర్భంలో కలపడానికి 24 గంటలూ కష్టపడండి. అన్ని వర్గాలూ దీపావళి చేసుకునే విధంగా శ్రమించండి. మీ అమ్మకు జరిగిన అవమానాన్ని పక్కనపెట్టి…రోడ్డుమీదకు వచ్చి ఆ పార్టీని సముద్రంలో నిమజ్జనం చేసేవరకు ఇంటి మొహం చూడకండి….అంటూ పవన్‌కు కర్తవ్య బోధ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*