పవన్‌ భయ్యా…ఇది కదరా అసలైన ఆట!

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీపైన, కొన్ని మీడియా ఛానళ్లపైన సాగిస్తున్న పోరాటాన్ని ఆయన అభిమానులు స్వాగతిస్తున్నారు. ఇందులో పవన్‌ శైలిని చూసి ముచ్చటపడుతున్నారు. తమదైన భాషలో సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ….పవన్‌కు మద్దతునిస్తున్నారు. అలాంటి అభిమానుల్లో ఓ బ్లాగర్‌ కింది విధంగా రాశారు….

థ్యాంక్స్‌ పవన్‌ భయా…రూటు మార్చి ఫాంలోకి వచ్చి చితక్కొడుతుంటే మహా ఆనందంగా ఉంది. ఎవడూ వెళ్లలేని దారిలో ఎదురెళ్లి మరీ బ్యాటింగ్‌ ఇరగదీస్తుంటే…ఏ బాల్‌ వేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్న బౌలర్లను చూసి నవ్వొస్తోంది. నిన్ను వాడుకోవాలని అనుకున్నవాళ్లను ఆడేసుకుంటుంటే ఇది కదరా అసలైన ఆట అనిపిస్తోంది. ఇప్పుడు సరిగ్గా నవ్వు లైన్లోకి వచ్చావు. మొన్నటి దాకా టిఫెన్స్‌ ఆడుతుంటే.. బోరు కొట్టింది. కోతికొమ్మచ్చిలాడుతున్నావని…నీ మీద కోపం వచ్చింది. మంగళగిరి మీటింగ్‌ దగ్గరు నువ్వు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ పికె మొదలుపెట్టాక అర్థమయింది. ఒకడి మీద కేసులు…ఇంకోటి మీద ఓటుకు నోటుతో పాటు చాలా ఊసులు…కానీ గ్లాసులు బద్ధలైనా నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. రేసు గుర్రంలా దూసుకుపోతుంటే మూసుకుని చూడాల్సిందే ఎవరైనా. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలని తిట్టి, ఆ తరువాత సైలెంట్‌ అయిపోయావు. వైజాగ్‌లో అంత ఊపు తెచ్చి నువ్వు మాత్రం రాలేదు. ఏంటిది అనుకున్నాం. ఇప్పుడు అర్థమవుతోంది. నిన్ను ఆపేశారని. నిన్ను వాళ్లకు కావాల్సినట్లు తిప్పాలనుకున్నారని. నీకు అర్థమై, ఎదురు తిరిగేసరికి…ఎన్ని ప్లానులు వేస్తున్నారు తొక్కేయడానికి.

ఏం ఫర్వాలేదు భయ్యా. నవ్వు కుమ్మేయ్‌. రాజకీయ లెక్కలతో రాష్ట్రానికి అన్యాయం చేసిన మోడీని, తనదాకా వస్తేగానీ అడ్డం తిరగని చంద్రబాబును, కుర్చీ కోసం, కేసుల కోసం మోడీతో దోస్తీ చేసిన జగన్‌ని…ఎవరినీ రానివ్వొద్దు. నివ్వొచ్చెయ్‌. నిజాయితీగా, నిక్కచ్చిగా జనం కోసం వచ్చేయ్‌. నీ కంటే తోపు ఎవడూ లేడిక్కడ. నువ్వే కావాలిక్కడ. దీక్ష చేస్తావో…రోడ్డెక్కి రచ్చ చేస్తావో…మంట పుట్టించేయాలంతే…ఇక డోంట్‌ వేస్ట్‌ టైమ్‌…నీ వెనుక రావడానికి కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు.

ఇలా పవన్‌ కల్యాణ్‌కు క్రికెట్‌ భాషలో మద్దతు ప్రకటించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*