పాత్రికేయులకు శ్రీకాళహస్తి ఎంఎల్ఏ చేయూత

శ్రీకాళహస్తి : కరోనాపై జరుగుతున్న‌ యుద్ధంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులతో పాటు…తమవంతు‌ బాధ్యత నిర్వర్తిస్తున్న పాత్రికేయులకు రాష్ట్ర ‌వ్యాపితంగా ప్రజాప్రతినిధులు చేయూత అందిస్తున్నారు.‌ ఇందులో భాగంగా శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి స్థానిక మీడియా ప్రతినిధులకు 40 రకాల నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఇంకా… కరోనా వైరస్ నుండి తమను తాము కాపాడుకోవడం కోసం స్మార్ట్ హెల్మెట్ , శానిటైజెర్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా ప్రతినిధులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, సమాచారం సేకరంచి ప్రజలకు చేరవేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జూనియర్ కాలేజ్ కరస్పాండెంట్ సుబ్బరామిరెడ్డి, ఆక్స్ ఫర్డ్ కాలేజ్ కరస్పాండెంట్ చెవిరెడ్డి మధుసూధన్ రెడ్డి, ఎంజెఎం నిర్వాహకులు మునీంద్ర, వైసిపి నాయకులు బుల్లెట్ జయశ్యామ్, సలీమ్, సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాత్రికేయులకు బియ్యం, సరుకులు‌ అందజేస్తున్న ఎంఎల్ఏ

భక్తవత్సల నాయుడు ఆధ్వర్యంలో…
విఆర్ఓల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు భక్తవత్సల నాయుడు…..తొట్టంబేడు మండలంలోని తంగేడుపాలెం యానాది సెంటర్, హరిజనవాడ, గౌడ్ మాల హరిజనవాడ, బసవన్న గుంట ఎస్టీ కాలనీ, కత్తివారి కండ్రిగ హరిజనవాడ, తంగేడి పాళెం క్రాస్ లోని మొత్తం 450 పేద కుటుంబాలకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఎర్రగడ్డలు పంపిణీ చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*