పాపం, చంద్రబాబుకు గోరుచుట్టుపై రోకటి పోటులా…దెబ్బ మీద దెబ్బ..!

Nara Chandrababu Naidu

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏదీ కలిసిరావడంలేదు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి. తాజాగా గోరుచుట్టుపై రోకలిపోటు చందంగా మరో దెబ్బ పడింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. తన నలుగురు రాజ్యసభ అభ్యర్థుల్లో పరిమల్ నత్వానీ కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన నత్వానీకి రాజ్యసభ ఇవ్వాల్సిందిగా ఇటీవలే స్వయంగా ముఖేష్ అంబానీనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి….ముఖేష్ అంబానీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు. తమ పార్టీకి అవకాశం ఉన్న నాలుగు సీట్లలో ఒక సీటును నత్వానికి కేటాయించారు.

ఇది కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం రుచించని పరిణామమే అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వల్ల పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నారని, పరిశ్రమలు వెళ్లి పోతున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తోంది.

ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ స్వయంగా అమరావతికి వచ్చి జగన్ ను కలవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారుతుం దనడంలో సందేహం లేదు. ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారాన్ని ఇకపై టిడిపి చేయజాలదు.

శాసన మండలీ రద్దయినట్లే…
ఇక ఈ రోజు
జరిగిన పరిణామాలు గమనిస్తే ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు అయినట్లుగానే భావించాల్సిన పరిస్థితి. శాసనమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొంతకాలంగా టెన్షన్ నెలకొంది. శాసన మండలి రద్దును పార్లమెంటు ఆమోదిస్తుందా లేదా అనే చర్చ సాగుతోంది. మండలి రద్దును బిజెపి వ్యతిరేకిస్తుందని తెలుగుదేశం పార్టీ‌ ఆశగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటిదాకా వైసీపీ తరఫున మండల్ లో ఉండూ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ ఇద్దరికీ రాజ్యసభ సీటును కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి రాజ్యసభ టికెట్ ఇవ్వడం అంటే శాసన మండలి రద్దు ఖరారైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మండలి రద్దుకు అనుకూలంగా కేంద్రం సంకేతాలు ఇవ్వడంతోనే జగన్మోహన్ రెడ్డి ఇద్దరికీ రాజ్యసభ టికెట్లు కేటాయించారని చెబుతున్నారు. ఇది కూడా తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా పెద్ద దెబ్బే అని చెప్పాలి.

1 Comment

  1. బాబును జైల్లో పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published.


*