పాపం…తెలుగుదేశం కార్యకర్తలు!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం 16.04.2018న నిర్వహించిన రాష్ట్రబంద్‌కు టిడిపి మద్దతు ఇవ్వలేదు. అయినా బంద్‌ విజయవంతమయింది. ఆర్‌టిసి బస్సులు డిపోల్లోనే ఉండిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాస్థంలు మూతపూడ్డాయి. బంద్‌ సక్సెస్‌ అయింది. బంద్‌ విషయంలో టిడిపి తీసుకున్న వైఖరి వల్ల ఆ పార్టీ చిత్తశుద్ధిపైన అనుమానాలు పెరగడానికి దోహదపడింది తప్ప…పార్టీకి ఒనగూడిన ప్రయోజనం ఏమీలేదనే చెప్పాలి. సాధారణంగా బంద్‌ల సమయంలో పోలీసులను ప్రయోగించి, నాయకులను అరెస్టు చేస్తుంటారు. ఆర్‌టిసి బస్సులను బలవంతంగా తిప్పుతుంటారు. ఈసారి ప్రభుత్వం అలాంటి సాహసం చేయలేకపోయింది. అరెస్టులు చేయిస్తే…ప్రత్యేక హోదా సాధించడంలో టిడిపి చిత్తశుద్ధి లేదన్న ప్రచారం జనంలోకి వెళుతుంది. అందుకే ప్రభుత్వం బంద్‌ను చూస్తూ ఊరుకోవడం మినహా ఏమీ చేయలేకపోయింది. ఎటూ బంద్‌ జరుగుతుందని కాబట్టి టిడిపి శ్రేణులు కూడా పాల్గొనివుండే పార్టీకి గౌరవంగా ఉండేది. తమ పార్టీ కూడా బంద్‌లో పాల్గొనివుంటే బాగుండేదన్న అభిప్రాయం పార్టీ కిందిస్థాయి శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ప్రత్యేక హోదా కోసం బంద్‌ చేస్తుంటే మీరెందు పాల్గొనలేదని ప్రజలు అడిగే ప్రశ్నలకు టిడిపి కార్యకర్తలు సమాధానం చెప్పుకోలేకపోయారు. బాబుగారు చెప్పిన సిద్ధాంత్తాన్ని (బంద్‌ల వల్ల నష్టం జరుగుతుందని) సమర్థించి చెప్పుకోలేక ఇబ్బందిపడ్డారు. ఈ సిద్ధాంతం చెబితే కాంగ్రెస్‌ హయాంలో చంద్రబాబు బంద్‌లో పాల్గొనలేదా? అని జనం ప్రశ్నిస్తున్నారు. అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనడానికి… బంద్‌లో విషయంలో తీసుకున్న వైఖరే నిదర్శనమి టిడిపి పార్టీ నేతలే వాపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*