పుండుపై కారం రాయడం తగునా?

ప్రధాని మోదీ గుంటూరు సభలో చేసిన ప్రసంగం ఎపి ప్రజల పుండుపై కారం రాసి నట్లుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ ఆడుతున్న చెండాట మధ్య పోట్ల గిత్తలు పోట్లాడుతుంటే లేగ దూడల కాళ్లు విరుగు తున్నాయి. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనతలపై ప్రసంగంకొన సాగించారు.

2014 తర్వాత ఇద్దరు ప్రధాని ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన తదుపరి కొన్నాళ్లు సజావుగా కాపురం చేయడం రాష్ట్ర విభజన హామీలను ఇరువురు పలు మలుపులు తిప్పడమే ఎపి ప్రజల కొంప ముంచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తీసుకున్న యు టర్న్ లు ప్రస్తుతం ప్రధాని ముఖ్యమంత్రి ని బోనులో పెట్టేందుకు ఆస్కారం లభించింది. పైగా ముఖ్యమంత్రి అనుసరించు తున్న అస్తవ్యస్త విధానాలు – తుదకు ఎపికి తీరని ద్రోహం చేసిన ప్రధాని ముఖ్యమంత్రి పై నాలుగు రాళ్లు వేసి వెళ్లేందుకు అవకాశం ఇచ్చింది. ప్రజలు ఆలకించే పరిస్థితి నెలకొంది.

ప్రధాని గుంటూరు సభలో సభికులు నవ్వు కొనేందుకు పనికి వచ్చిందికాని ఎపి ప్రజల సందేహాలు తీర్చే విధంగా లేవు. మూడు లక్షల కోట్లు ప్రాజెక్టులు ఎపికి ఇచ్చామని చెప్పారు కాని వాటిని వివరించలేదు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఏ ఏరంగాలో ఎంత మేరకు నిధులు ఇచ్చింది వివరించ లేదు. కడప ఉక్కు కర్మాగారం వెనుక బడిన ప్రాంతాల నిధులు ఎందుకు ఆపేరో అందుకు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ఎమైనా వుందా ఆ వివరాలను ప్రధాని తన ప్రసంగంలో మాట మాత్రంగా ప్రస్తావించ లేదు..

అదే విధంగా పోలవరం ప్రాజెక్టు అంశంలో అవినీతి జరిగిందని రాష్ట్ర బిజెపి నేతలు చెబుతున్నారు. ఈ అంశం కూడా ప్రధాని రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్ప వలసి వుంది.గుంటారు సభకు ముందు కేంద్రం నుండి నిధులు పొందటంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం గురించి ప్రధాని ప్రముఖంగా వివరించు తారని భావించారు. కాని ఆ అంశాల జోలికి ప్రధాని వెళ్లక పోవడంతో ముఖ్యమంత్రికి వెసులు బాటు లభించింది. ఎవరు చెప్పేది వాస్తవమో తెలియని స్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ కేంద్ర నుండి నిధులు రావడం లేదని చెబుతున్నారు.

ఈ అంశంలో వాస్తవ మేమిటో ఒక్క ముక్క ప్రధాని వివరణ ఇవ్వలేదు. రాష్ట్ర అభివృద్ధి కి అవసరమైన మేరకు కేంద్ర ఇవ్వ వలసిన నిధులు ఏమేరకు ఇచ్చారో ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి వుంటే ఆ వివరాలను ప్రధాని తన ప్రసంగంలో పేర్కొని వుంటే ముఖ్యమంత్రి ముద్దాయిగా ప్రజల ముందు నిలబడే వారు. కాని ప్రధాని వాటి జోలికి వెళ్లకుండా ముఖ్యమంత్రిని ఆయన బలహీనతలపై ప్రసంగం కొన సాగించడంతో అంతిమంగా ప్రధాని ఎపి ప్రజల ముందు ముద్దాయిగా నిల్వ వలసి వచ్చింది.

వి.శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*