పులిపిల్లకు సిఎం పేరు..!

తిరుపతి జూపార్కులో పుట్టిన తెల్లపులి పిల్లలకు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి నామకరణం చేశారు. జూలోని సమీర్, రాణి అనే తెల్లపులులకు ఇటీవల ఐదు పిల్లలు పుట్టాయి. వాటికి
వాసు, సిద్దన్, జగన్, దుర్గా, విజయ అనేపేర్లను మంత్రి పెట్టారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో శుక్రవారం ఉదయం 65వ వన్యప్రాణి వారోత్సవాలు రాష్ట్రస్థాయి కార్యక్రమలో అటవీశాఖ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ అటవీ చట్టం మేరకు 33 శాతం అడవి భూభాగం ఉండాలని కానీ మన రాష్ట్రంలో 23 శాతం ఉందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అటవీ సంపద రక్షణ , పచ్చదనం పెంపుపై ఈ సంవత్సరం దృష్టి సారించి 25 వేల కోట్ల మొక్కల లక్ష్యంగా పంపిణీతోపాటు నాటడం జరుగుతున్నదని అన్నారు. అటవీశాఖలో ప్రధాన సమస్య వాహనాలని ముఖ్యమంత్రి సమీక్షలో వారి దృష్టికి తీసుకెళ్లడంతో రూ.40 కోట్లు మంజూరు చేశారని అన్నారు. గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించామని, శిక్షణ పొందిన ఫారెస్ట్ రేంజర్ లకు, సిబ్బందికి వేపన్సు ఆడించడం జరుగుతున్నదని అన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపు తున్న మని ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని, అటవీ సంపద రక్షణ ఈ ప్రభుత్వ ప్రాముఖ్యతని అన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*