పూరీకి విశ్రాంతి అవసరమట..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తన తనయుడు ఆకాశ్‌ పూరీని హీరీగా పెట్టి ‘మెహబాబూ’ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘ఆంధ్రాపోరీ’ పేరుతో ఆకాశ్‌ హీరోగా వచ్చిన తొలి సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం చేరువకాలేకపోయింది. ఇప్పుడు పూరీనే స్వయంగా రంగంలోకి దిగి ‘మెహబూబా’ నిర్మించారు. పూర్వజన్మ, ప్రేమ, పాకిస్తాన్‌-భారత్‌ యుద్థం ఇవన్నీ కలగిసిన మెహబూబాపై ఒక సమీక్ష కూడా అనుకూలంగా రావడం లేదు.

ఈ సినిమాకు సంబంధించి అన్ని రివ్వ్యూలు చెబుతున్న అంశం ఒక్కటే…పూరీ సినిమాల్లో ఉండే వేగం, కమర్షియల్‌ అంశాలు లేకపోవడమే పెద్ద మైనస్‌ పాయింట్‌. హీరోగా చేయడానికి, అందులోనూ ఇటువంటి కథాంశాన్ని చేయడానికి ఆకాశ్‌ వయసు సరిపోలేదన్నది ప్రధాన విమర్శ. లేత వయసు కుర్ర హీరో జోడీగా ఎంపిక చేసిన హీరోయిన్‌ అతనికంటే మురుదుగా కనిపిస్తుండటం వల్ల జోడీ కుదరలేదన్నది మరో విమర్శ. ‘ముక్కుపచ్చలారని ముఖాన్ని హీరో చేయాలన్న తపన నీకు వుండొచ్చుగానీ…ఆ లేత కోరింకకు ముదురు చిలుకను జోడీగా చేసిన నీ ఎంపికలోఎంత పొరపాటు ఉంది’ అని విమర్శించిన ఓ సమీక్షకుడు…’పూరీ నీకు విశ్రాంతి అవసరం అనిపిస్తోంది’ అని రాశారంటే జోడీ ఎంపికలో ఎంత తీవ్రమైన పొరపాటు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా కథను తెరకెక్కించడంలో లోపాలు జరగొచ్చు….ప్రాథమికైన హీరో, హీరోయిన్‌ ఎంపికలోనే పొరపాటు జరిగితే…అది తీవ్రమైన తప్పిదమే లెక్క. ఈ విధంగా చూస్తే పూరీజన్నాథ్‌ దర్శకుడిగా ఘోరంగా విఫలమయ్యారని అనుకోవాలి.

అయితే…ఆకాష్‌ నటనకు మాత్రం ప్రశంసలు లభిస్తున్నాయి. మొదటి నుంచి అందరూ చెబుతున్నారు…ఈ సినిమా పూరీ సినిమాలా ఉండదని. నిజంగానే పూరీ సినిమాలా లేదు. ఎవరో తీసినట్లు ఉంది. ఇది సినిమాకు ఫ్లస్‌ అవుతుందని అనుకున్నారుగానీ….మైనస్‌ అయింది. పూరీ మార్కుతో సినిమా ఉండివుంటే ప్రేక్షకుల అంచనాలను అందుకుని ఉండేది. ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ‘నన్ను మా నాన్న పరిచయం చేయలేదు. నేనే మానాన్నను పరిచయం చేస్తున్నా’ ఆకాశ్‌ చెప్పిన మాటలు ఒకింతి అతి ఆత్మవిశ్వాసంగా కనిపించినా….సినిమా చూశాక ఆ మాటల్లో తప్పులేదనిపిస్తుంది. పూరీ తనయుడిగా ఆకాశ్‌కు గుర్తింపువున్నా… నటుడిగా తనకు సత్తావుందని చాటుకున్నాడు. డైరెక్టర్‌గా పూరీ ఫెయిలూర్స్‌ ఉన్నా నటుడిగా ఆకాశ్‌ ప్రశంసలు అందుకోవడం నిజంగా పూరీకి సంతోషం కలిగిస్తుంది. ‘పుత్రుడు జన్మించినపుడుకాదు…’ అని అంటారు కదా!

ఇటీవల కాలంలో పెద్ద సంక్షోభం నుంచి పూరీ బయటపడ్డారు. తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన డ్రగ్స్‌ కేసుతో మానసికంగా కుంగిపోయారు. ఇటువంటి పరిస్థితి నుంచి తేరుకుని, మళ్లీ సినిమా తీయడం కష్టమే. సినిమా ఒక సృజనాత్మక కళ. దానికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. లేకుంటే ఏకాగ్రత కుదరదు. రిజీల్‌కు ముందుగా సినిమా చూసిన వాళ్లంతా ‘పూరీ మనసు పెట్టి సినిమా తీస్తే ఎలావుంటుందో మెహబూబా చూస్తే తెలుస్తుంది’ అని పూరీని పొగడ్తల్లో ముంచేసి….నిజంగానే ఆయన్ను ముంచేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*