పెట్రోల్‌ కోసం పక్క దేశానికి వెళుతున్నారు అక్కడి టాక్సీవాలాలు..!

ఈ శీర్షిక చదవగానే కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నమ్మశక్యం కాకపోవచ్చు. పెట్రోలు కోసం పక్క దేశానికి వెళ్లడం ఏమిటి…ఇదేదో తప్పుడు వార్త అనుకోవచ్చు. కానీ ఇది అక్షర సత్యం. మన దేశంలోని ఉత్తరాఖండ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన నెపాల్‌ సరిహద్దు జిల్లాల్లోని టాక్సీవాలాలు నేపాల్‌కు వెళ్లి పెట్రోల్‌, డీజిల్‌ పట్టుకొస్తున్నారట. ఎందుకంటే…అక్కడ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మనకంటే రూ.14 తక్కువగా ఉంది.

ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రకారం….ఉత్తరాఖండ్‌లోని చంపావట్‌ జిల్లా ఉద్దమ్‌నగర్‌లో లీటరు పెట్రోలు రూ.82.63, డీజిల్‌ ధర రూ.74.90గా ఉంది. అదే నేపాల్‌లోని కాంచన్‌పూర్‌ జిల్లాలో పెట్రోలు రూ.68.20; డీజిల్‌ ధర రూ.58.30గా ఉంది. అంటే లీటరుపై రూ.14దాకా తేడా ఉంది. అందుకే పక్క దేశానికి వెళ్లి పెట్రోలు పట్టించుకుంటున్నారు. ఒకసారి వెళితే ఫుల్‌ ట్యాంక్‌ నింపుకుని వస్తున్నారట. 50 లీటర్లు కొట్టించుకున్నా… రూ.700 దాకా ఆదా అవుతుండటంతో కాస్త దూరమయినా అక్కడికే వెళ్లి పట్టించుకుంటున్నారట.

ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనూ ఉంది. చిత్తూరు జిల్లా సరహద్దుల్లోని తమిళనాడులో మనకంటే రూ.1, రూ.2 తక్కువే ఉంటుంది. అందుకే సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తమిళనాడుకు వెళ్లి పెట్రోలు, డీజిల్‌ పట్టించుకుంటారు. అయినా పక్క దేశానికి వెళ్లి పెట్రోలు పట్టించుకోవడం కాస్త వింతగానే ఉంది కదూ!

[email protected]

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*