‘పెదరాయుళ్లు’ కాదులే…’మెగారాయుళ్లు!

ఇటీవల టివి ఛానళ్లకు, తెలుగు సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలకు మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ను శ్రీరెడ్డి దూషంచిన దృశ్యాలను పదేపదే ప్రసారం చేయడంతో…ముఖ్యమంత్రి తనయుడు లోకేష్‌, తెలుగుదేశం అనుకూల మీడియాతో కలిసి తనపై కుట్ర చేస్తున్నారని పవన్‌ ప్రటించారు. ఇదే సమయంలో కొన్ని టివి ఛానళ్ల పేర్లు చెప్పి, ఆ ఛానళ్లను బహిష్కరించమని తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే….చిరంజీవి నేతృత్వంలో సమావేశమైన కొందరు తెలుగు హీరోలు….తెలుగుశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఛానళ్లకు ఇంటర్వ్యూలు వంటి కంటెంట్‌ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. దీనిపైన సమావేశమైన కొన్ని టివి ఛానళ్ల ఎడిటర్లు….తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. సినిమా వాళ్లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనంతటికీ కారణం మెగా ఫ్యామిలీ హీరోలేనని టివి ఛానళ్లు విశ్వసిస్తున్నాయి. ఆ నాటి హీరోల సమావేశానికి మెగా హీరోలంతా హాజరయ్యారు. ఇంకా జూనియర్‌ ఎన్‌టిఆర్‌, మహేష్‌బాబు వంటి ఇతర హీరోలూ వచ్చారు. బాలకృష్ణకు సమాచారం ఇచ్చినా హాజరుకాలేదు. మహేష్‌బాబు మినహా టిడిపిని వ్యతిరేకించే హీరోలంతా సమావేశమైనట్లు లెక్క. ఆ హీరోలే ఛానళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో….ఓ సినిమా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విలేకరులు ‘టివి ఛానళ్లను బహిష్కరించమని పిలుపునిచ్చారు…ఇద సబబా’ అని ప్రశ్నంచగా…మేమేమైనా పెదరాయుళ్లమా అలాంటి నిర్ణయాలు చేయడానికి, సినీ పరిశ్రమను ఆదేశించడానికి అని ఎదురు ప్రశ్నించారు నాగబాబు. నాగబాబు ఎంత కాదన్నా….పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగా మీడియాతో పోరాటం సాగిస్తున్నారు. వాస్తవంగా పవన్‌ చేస్తున్నది తప్పుకూడా కాదు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన మీడియా….పక్షపాత ధోరణితో, కక్షపూరితంగా వ్యహరిస్తోంది. దీన్నే పవన్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమంలోనే…తెలుగు హీరోలంతా సమావేశమై ఛానళ్లకు ఇంటవ్వ్యూలు వంటివీ ఇవ్వకూడదని నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. నాగబాబు ఎంత ఖండించినా….కొందరు హీరోలు కొన్ని తెలుగు ఛానళ్ల పట్ల వ్యతిరేకంగా ఉన్నమాట వాస్తవం. ఇందుకు మెగా ఫ్యామిటీ తీసుకున్న చొరవ కూడా కారణం. అందుకే చిరంజీవి, పవన్‌, నాగబాబు, చరణ్‌, బన్నీ….తదితరులును పెదరాయుళ్లు అనకున్నా…’మెగా రాయుళ్లు’ అనొచ్చేమో!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*