పెద్దనోట్లు రద్దయినా…బిజెపికి వెయ్యి కోట్లు!

పెద్దనోట్లు రద్దవడంతో చాలామంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. చిరు వ్యాపారులు చితికిపోయారు. దేశ ఆర్థిక వృద్ధి కుంటుపడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మాత్రం పెద్దనోట్లతోనే బాగా బాగుపడినట్లుంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆ పార్టీపైన ఏమీ కనిపంచడం లేదు. బిజెపికి గత ఏడాది ఏకంగా వెయ్యి కోట్లకుపైగా విరాళాల రూపంలో వచ్చిపడ్డాయట. అంతకు మునుపు ఏడాదితో పోల్చితే ఏకంగా 81 శాతం విరాళాలు పెరిగాయట. ఇందులో కార్పొరేట్‌ బాబులు ఇచ్చిన 'విరాళాలు' ఎంతో బిజెపినే చెబితేగానీ తెలియదు. ఇటీవలే ప్రపంచంలోనే ఏ పార్టీకీ లేనంత పెద్ద ఆఫీసును నిర్మించుకున్న బిజెపి...ఇప్పుడు వెయ్యి కోట్ల విరాళాలతో చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు విరాళాలు తగ్గిపోయాట. బిజెపి అధికారంలో ఉంది...కాంగ్రెస్‌ అధికారంలో లేదు. అదే తేడా.

అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) 2016-17కు గానూ దేశంలోని ఏడు జాతీయ పార్టీల ఆదాయాలపై ఏడీఆర్‌ అధ్యయనం చేసింది. కేవలం ఏడాది కాలంలోనే బీజేపీ పార్టీ ఆదాయం 81.18 శాతం పెరిగి రూ.1,034.27 కోట్లకు చేరుకోవడం గమనార్హం.  2015-16లో ₹570.86 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం. 2016-17లో  1,034.27 కోట్లకు అనూహ్యంగా పెరిగింది. బీఎస్పీ, ఎన్సీపీ పార్టీల ఆదాయాలు పెరగగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆదాయం తగ్గింది. జాతీయ పార్టీల్లో కెల్లా సీపీఐ అతి తక్కువ ఆదాయాన్ని 2.08 కోట్లు కల్గి ఉన్నది. ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన గణాంకాల ఆధారంగా ఏడీఆర్‌ రిపోర్ట విడుదల చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*