పెస్పీ మెడలు వంచిన సోషల్‌ మీడియా..!

ప్రధాన ప్రసంతి మీడియా పట్టించుకోకున్నా, ఆ బహుళజాతి సంస్థ ఇచ్చే ప్రకటనలకు కక్కుర్తిపడి మన రైతులకు అది చేస్తున్న అన్యాయాన్ని తొక్కిపెట్టినా…సోషల్‌ మీడియా మాత్రం వదిలిపెట్టలేదు. తోలుతీసి డోలు కట్టింది. దీంతో రైతు పాదాల చెంతకు దిగిరాక తప్పలేదు ఆ సంస్థకు. ఇంతకీ అసలు విషయం ఏమంటే….

బహుళజాతి సంస్థ అయిన పెప్సీ గుజరాత్‌ రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తాము లేస్‌ చిప్స్‌ తయారు చేయడానికి వినియోగిస్తున్న ఎఫ్‌సి-5 రకం ఉర్లగడ్డ విత్తనాలపై తమకు పేటెంట్‌ హక్కులు ఉన్నాయని, ఈ రకం ఉర్లగడ్డలను తమ అనుమతి లేనిదే ఎవరూ పండించకూడదని పెప్సీ హూంకరించింది. విత్తన చట్టాల గురించి తెలియని గుజరాత్‌లోని కొందరు రైతులు ఎఫ్‌సి-5 రకం ఉర్లగడ్డలను పండించిందినందుకు తమకు కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కోర్టులో కేసులు పెట్టింది పెన్సీ కంపెనీ.

ఈ వార్తను ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోలేదు. ఎన్నికల హడావుడిలో ఉండి పట్టించుకోలేదు అనేకంటే….పెస్సీ ఇచ్చే కోట్లాది రూపాయల ప్రకటనలు పోతాయన్న భయంతోనే ఆ మీడియా ఈ వార్తను చూసీచూడనట్లు వదిలేసింది. అయితే సోషల్‌ మీడియా మాత్రం విడిచిపెట్టలేదు. భారత దేశంలోనే కాదు…విదేశాల్లోని నెటిజన్లు సామాజిక మాధ్యమల్లో తమ గొంతు వినిపించారు. పంట పండించినందుకు రైతుపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పెస్సీ తయారు చేసే లేస్‌ చిప్స్‌ కొనవొద్ద అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ప్రచారమే మొదలుపెట్టారు.

సోషల్‌ మీడియా కొట్టిన దెబ్బకు పెస్సీ పరువు గంగలో కలిసింది. పైగా ఆ కంపెనీ ఉత్పత్తుల అమ్మకాలకు ఎసరువచ్చే ప్రమాదం ముంచుకొచ్చింది. దీన్ని గమనించిన ఆ కంపెనీ…రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని ప్రకటించింది. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పింది. కచ్చితంగా ఇది సోషల్‌ మీడియా సాధించిన విజయంగానే చెప్పాలి. జయహో సోషల్‌ మీడియా..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*