పేదలకు నిత్యావసరాల పంపిణీ

కరోనా కరల నృత్యానికి ప్రపంచమంతా విలవిల లాడుతున్నాయి మనదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అదే స్థాయిలో కరోనా మహమ్మారి వలన చాలా ఇబ్బందులు రోజు రోజు ఎదుర్కొంటున్నాయి. రెక్కాడితే డొక్కాడని కొన్ని జీవితాలు బడుగుల జీవితాలు ఇతర రాష్ట్రాల వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గ్రహించిన శ్రీకాళహస్తి పట్టణంలోని బీపీ అగ్రహారంలో గల శ్రీహరిజనరల్ స్టోర్ అధినేత, తెలుగుదేశం కార్యకర్త రాష్ట్ర గాండ్ల యువజన సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కన్నావరం హరిబాబు…పంజాబ్ రాష్ట్రానికి చెందిన కొన్ని కుటుంబాలకు చికెన్, గుడ్లు, గోధుమ పిండి, సన్ ప్లవర్ ఆయిల్, సుబ్బులు, పాలు, పెరుగు, కూరగాయలు, పప్పు దినుసులు ఒక వారానికి సరిపడే వస్తువులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వలస కూలీలు మాట్లాడుతూ డబ్బులు ఉన్నపుడు గత కొన్ని నెలలుగా వీరి దుకాణం నందు కిరాణా వస్తువులు డబ్బులు ఇచ్చి తీసుకొనే వాళ్ళం ప్రస్తుత పరిస్థితి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి డబ్బులు దొరకని సమయంలో హరిబాబు తమకు ఐదువేల రూపాయిల విలువైన కిరాణా వస్తువులు మాకు ఉచితంగా ఇవ్వడం మాకు సంతోషంగా ఉందని చెప్పారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పేటుపాకం ఆర్ముగం పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*