పేదలకు బియ్యం పంపిణీ చేసిన స్కిట్ మాజీ ఛైర్మన్ వంజవాకం గురుదశరథన్

శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల మాజీ ఛైర్మన్‌ వంజవాకం గురుదశరధన్ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 9వ వార్డుకు చెందిన సుమారు 500 మంది ప్రజలకు 10 కిలోల బియ్యం, పప్పు, నూనె, మిరపకాయలు, చింతపండు ఉప్పు తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాధి చిత్తూరు జిల్లాలో 28 కేసులు నమోదయ్యాయని, ఇందులో 10 కేసులు శ్రీకాళహస్తిలో నమోదు అయ్యాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని చెప్పారు. దీంతో తనకు తోచిన రీతిలో సహాయం అందించాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, ప్రతి 20 నిమిషాలకు, చేతులు కడుక్కోవాలని, కరోనాను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమై తమను తాము కాపాడుకుంటూ ఇతరులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం 9వ వార్డు మాజీ కౌన్సిలర్ గిరిధర్ మాట్లాడుతూ కరోనా వ్యాధి గురించి అధైర్య పడవద్దని పరిశుభ్రతతో పాటించడంతో పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి చెప్పారు. అలాగే ఒక రోజులో నాలుగు సార్లు నాలుగైదుసార్లు వేడి నీళ్లు, ఉప్పు, పసుపు కలిపి నీళ్లలో వేడి వేడిగా తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఆర్కాడు శేఖర్, పాలమంగళం రవి, జీవ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*