పేదలకు బియ్యం, సరుకుల పంపిణీ‌ చేసిన వైసిపి నేత కలివెల కిరణ్

శ్రీకాళహస్తి మండలం చిందే పల్లి గ్రామం ఎస్టీ కాలనీ నందు 50 మంది గిరిజన కుటుంబాలకు శ్రీకాళహస్తి స్థానిక వైయస్సార్ సిపి నాయకుడు కలివెల కిరణ్ …బియ్యం , కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి సేవ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు కిరణ్ చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలోని బడుగు వర్గాల రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు, కరోనా లాక్ డౌన్ వల్ల పనులు లేక గడపదాటని పరిస్థితులలో ఉన్నారని‌ అన్నారు. ఇటువంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆలోచనతోనే తన‌ శక్తి మేరకు.. బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశానని కిరణ్ చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*