పోలీస్ దర్ప(రా)మా…!

మాజీ పోలీసు అధికారి వర్ల రామయ్య రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి చాలా ఏళ్లుయినా ఇప్పటికీ ఆయనలో ఖాకీ వాసనలు పోయినట్లు లేదు. ఆయన ఆ ఆధిపత్య ధోరణులు వదులుకోలేకున్నారు. ఓ యువకుడిని ఉద్దేశించి రామయ్య మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. కులం పేరు ప్రస్తావిస్తూ మీరు చదువుకోరు, బాగుపడరు అంటూ ఆక్షేపణీయ పద్ధతిలో మాట్లాడారు. వాస్తవంగా ఆయన తెలుగుదేశం సభల్లోనూ ఇదే ధోరణితో మాట్లాడుతుంటారు. నాయకులను అదిలించిపారేస్తారు. తిరుపతిలో తుడ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించిన సభలో వేదికపైన ఉన్న నాయకులను గద్దించిపారేశారు. ఇదేసభలో పోలీసు కానిస్టేబుల్ నూ అనుచితంగా మాట్లాడారు. ‘ఏయ్ ఖాకీ.. పో వెనక్కి, సభా వేదికపై నీకేం పని’ అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక, సభా వేదికలో కనిపించేందుకు పార్టీ కేడర్ పోటీపడటంతో కార్యకర్తల్లో క్రమశిక్షణ లేదంటూ మైక్ తీసుకుని సీరియస్ అయ్యారు. ఏయ్..రేయ్ అంటూ గద్దించారు. అప్పుడు ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రామయ్య తీరుతో టిడిపి నేతలు నొచ్చుకున్నారు. ఇదే ధోరణి కొనసాగితే అది పార్టీకి నష్టం చేస్తుంది. అయినా ఇటీవల టిడిపి నాయకులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. కర్నూలులో చంద్రబాబు మాట్లాడిన తీరు ఇందుకు నిదర్శనం. ప్రతిపక్షాలు ఏం పీకాయి అని మాట్లాడటం సిఎం హోదాకు మెప్పదు. గతంలో బాలకృష్ణ ప్రధాన మంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అదేవిధంగా మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులను అన్నమాటలు వివాదం అయ్యాయి. నాయకులు సహజంగానూ హుందసగానూ ఉండాలి. ఇది సమాచార యుగం నోరుజారి ఒకమాట అనినా క్షణాల్లో జనంలోకి వెళ్ళిపోయింది. దీన్ని ఎప్పడూ గమనంలో ఉంచుకోవాలి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*