ప్రత్యక్ష రాజకీయాల్లోకి భూమన అభినయ్ రెడ్డి…!

తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు భూమన అభినయ్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేసి సత్తా చాటుకునేందుకు‌ సిద్ధమవుతున్నారు.

యువకుడైన అభినయ్ రెడ్డి చాలాకాలంగా తిరుపతి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రి కరుణాకర్ రెడ్డి విజయం కోసం అన్నీ తానై పని చేశారు. తిరుపతిలో వైసిపి గెలుపు వెనుక అభినయ్ పాత్ర చాలావుంది.

ఎన్నికలకు చాలా ముందు నుంచే నగరంలోని‌ అన్ని డివిజన్లలో తిరుగుతూ బలమైన నెట్ వర్క్ నిర్మించారు. నేతలతోనూ, కార్యకర్తలతోనూ మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు. అందరినీ కలుపుకుపోతారన్న పేరు సంపాదిం చుకున్నారు.

కరుణాకర్ రెడ్డి గెలిచిన తరువాత….ప్రజల సమస్యలు పరిష్కరించడంలోనూ, నగర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలోనూ అభినయ్ కీలక భూమిక పోషిస్తున్నారు. అభినయ్ వద్దకు వెళితే ఏపనైనా చేసిపెడతారన్న నమ్మకాన్ని పార్టీ‌ శ్రేణుల్లో కలిగించగలిగారు.

ఇదిలావుండగా…సుదీర్ఘ కాలం తరువాత జరుగుతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేయడం ద్వారా…ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. పోటీ చేయడానికి అనువుగా ఉన్న నాలుగు డివిజన్లను ఇప్పటికే గుర్తించారు. ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఒకటి రెండు రోజుల్లో తేలిపోతుంది.

తిరుపతి మేయర్ పదవి మహిళకు రిజర్వు అయింది. ఈ నేపథ్యంలో మేయర్ అవకాశం అభినయ్ రెడ్డికి లేదుగానీ… డిప్యూటీ మేయర్ అయ్యేందుకు అవకాశాలున్నాయి. ఆల్ ద బెస్ట్ టు అభినయ్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*