ప్రపంచస్థాయి ఆదర్శ గ్రామంగా సంతోష్ నగర్

  • గిరిజన కాలనీలో అన్ని రకాలుగా అభివృద్ధి
  • కల్కీ మనుమరాలు లోకాజీ

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి
వరదయ్యపాళ్యెం మండలంలోని దరకాసు గ్రామ సమీపంలో కల్కీకి చెందిన వన్ హ్యూమానిటీ కేర్ నూతనంగా నిర్మించిన సంతోష్ నగర్ ను ప్రపంచస్థాయి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కల్కీ భగవాన్ మనుమరాలు లోకాజీ పేర్కొన్నారు. శనివారం సంతోష్ నగర్ నూతన కాలనీని కల్కీ కుమారుడు శ్రీకృష్ణాజీ, కోడలు ప్రీతాజీ, వీరి కుమార్తె ప్రీతాజీ ప్రారంభించారు. ముందుగా హోమం నిర్వహించారు. అనంతరం వైభవంగా గిరిజనులతో కలిసి వారి గృహ ప్రవేశాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో లోకాజీ మాట్లాడుతూ సంతోష్ పురం గిరిజనులు అభివృద్ధికి నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఒక్కో గుడిసెలో ఐదు నుంచి పది మంది వరకు జీవనం సాగించేవారన్నారు. వారి కష్టాలు చూసి ఆపన్నహస్తం అందించినట్లు తెలిపారు. 3 కోట్ల రూపాయలతో 23 పక్కాఇళ్లు, కమ్యూనిటిహాలు నిర్మించినట్లు తెలిపారు. రోడ్లు, తాగునీటి బోర్లు ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. వెయ్యి గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని గ్రామాల్లో ఆర్ ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రస్తుతం175 గ్రామాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందల సంఖ్యలో వచ్చిన భక్తులు నూతన కాలనీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ ఆచాజీ, లోకేష్ దాసాజీ ,రుద్రదాసాజీ , రాఘవన్ జీ , ఎంఎల్ సి వాకాటి నారాయణరెడ్డి, గంగాప్రసాద్ పలువురు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*