ప్రభుత్వ సమాచారమంతా టిడిపి ఆఫీసులో…ఇదిగో సాక్ష్యం!

– ఐటి గ్రిడ్ ద్వారా చోరీ

హైదరాబాద్ లోని ఐటి గ్రిడ్ రగడ అందరికి తెలిసిందే. ఎపి ప్రభుత్వ సమాచారమంతా చోరీ చేసిందనే ఫిర్యాదు పై తెలంగాణ పోలీసులు సదరు సంస్థ పై దాడులు చేయడం కొందరిని అరెస్టు చేయడం తుదకు ఈ వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడమూ అందరికి తెలుసు. ఎపి ప్రభుత్వ మాత్రం తమ పార్టీకి చెందిన సమాచారం తెలంగాణా పోలీసులు ఐటి గ్రిడ్ నుండి చోరీ చేసి వైసిపి పార్టీ కి అందజేశారని ఎదురు దాడికి దిగింది. ఇది గత చరిత్ర.

కాని ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఎపి ప్రభుత్వ సమాచారమంతా ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ ఆఫీసులో వుందనేందుకు ఎన్నో ఆధారాలున్నాయి. ఇవి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో వీటి ఆనవాలు కనపడుతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్ర టీడీపీ ఆఫీసు నుండి రాష్ట్రం నలుమూలల కు ఫోన్లు వెళ్లుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం పొందిన వారికి ఈ ఫోన్లు వస్తున్నాయి. ప్రభుత్వం నుండి సాయం పొందిన వారి ఫోన్ నెంబర్లు టిడిపి రాష్ట్ర ఆఫీసుకు ఏలా చేరాయి?
రాష్ట్ర టీడీపీ ఆఫీసునుండి ఒక మహిళ ఫోను చేసి తను టిడిపి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని చెబుతూ పేరు ఇతర సమాచారం అడిగి “మీరు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం పొందారు కదా. ప్రస్తుతం ఆరోగ్యం వున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు? ముఖ్యమంత్రి సాయం పొందారు కాబట్టి టిడిపి ఓటు వేయాలి కదా? మీ పక్క వారికి చెప్పి సైకిల్ గుర్తు కు ఓటు వేయండి.” అంటూ ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టడం చేస్తున్నారు.
అంతేకాకుండా గ్రామాల్లో రైతు రథం ఇతరత్రా ప్రభుత్వ సాయం పొందిన లబ్ధిదారులకు ఇదే విధమైన ఫోనులు రాష్ట్ర టీడీపీ ఆఫీసు నుంచి రోజూ వస్తున్నాయి.

ప్రభుత్వ సాయం పొందిన లబ్ధిదారులు వివరాలు ఫోన్ నెంబర్లు ప్రభుత్వ రికార్డులలో వుండాలి. ఇవి రాష్ట్ర టీడీపీ ఆఫీసుకు ఏలా చేరాయి?
వాస్తవం చెప్పాలంటే 2014 లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ప్రభుత్వానికీ తేడా లేకుండా పోయింది. ఎట్టి చట్ట బద్దత లేని జన్మ భూమి కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేశారు. లంచాలు బాగా గుంజారు. ఎన్నికైన సర్పంచులు ఉత్సవ విగ్రహాలను చేశారు. దాని ఫలితం అనుభవిస్తున్నారు.
ఈ దుర్మార్గం ఎంతవరకు వెళ్లిన దంటే పసుపు కుంకుమ చెక్కులు పంపిణీ కూడా టిడిపి కార్యకర్తలు పంచిన సందర్భాలు లేకపోలేదు.

ప్రభుత్వం సమాచార మంతా టిడిపి ఆఫీసు కు చేరినందుననే ఎన్నికల ముందు వివిధ శాఖల ద్వారా సాయం పొందిన వారి ఫోన్ నెంబర్లు టిడిపి ఆఫీసులో వుండటమే నిదర్శనం. . ఫలితంగా రోజు లబ్ధిదారులకు ఫోనులు చేసి ఒక రకంగా ఎన్నికల ప్రచారం చేస్తూ టిడిపి కి ఓట్లు వేయ మని కోరుతున్నారు.. రాష్ట్ర టీడీపీ ఆఫీసు నుండి వచ్చే ఫోన్ ల్లో కింద నెంబరు ఒకటి గా వుంది.
918662467840 నెంబర్ నుండి ఫోనులు రావడం గమనార్హం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*