ప్రాణాలకు తెగించి…కరోనాకు ఎదురెళ్లి…చిన్ని చేస్తున్న పెద్ద సాహసం..!

ప్రపంచ దేశాలను గజగజ ఒణికిస్తున్న కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడం కోసం కోట్ల మంది తలుపులు బిగించుకుని ఇంట్లో ఉంటున్న పరిస్థితి. వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, జర్నలిస్టులు….ఇలా కొన్ని రంగాల వారు కరోనా విధుల్లో ఉన్నప్పటికీ… ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటే బాగుండునన్న భావన ఎందరిలోనే ఉంది. ప్రాణ భయమే దీనంతటికీ కారణం.  

ఓ యువకుడు మాత్రం ప్రాణాలకు తెగించి కరోనా భూతానికి ఎదురెళ్లుతున్నాడు. కోరుకుని మరీ కరోనా బాధితుల మధ్య ఉంటూ సేవలు అందిస్తున్నాడు. కరోనాపై పోరాటంలో తన ప్రాణాలు పోయినా ఫర్వాలేదంటూ దాదాపు రెండు నెలలుగా క్వారంటైన్‌ సెంటర్‌లోనే ఉంటూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న చిన్ని అనే యువకుని పెద్ద సాహస గాథ ఇది.  

చిత్తూరు జిల్లా ఐరల మండలం ఇరువారంపల్లికి చెందిన చిన్ని బిఎస్సీ నర్సింగ్‌ చదివారు. ఆపై ఎంఎస్‌స్సీ సైకాలజీ పూర్తి చేశారు. హైదరాబాద్‌ వెళ్లి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో పని చేశారు. ఆపరేషన్‌ థియేటర్‌లో సహాయకుడిగానూ, మానసిక వ్యాధులతో బాధపడే వారిలో మనోస్థయిర్యాన్ని నింపే కౌన్సిలర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ఇదే వృత్తిలో విదేశాలకు వెళ్లి స్థిరపడాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే ఉరుముల్లేని పిడుగుల్లా కరోనా మహమ్మారి వచ్చిపడింది.

కరోనాకు భయపడి హైదరాబాద్‌ నుంచి అందరూ ఇళ్లదారి పట్టారు. కార్పొరేట్‌ ఆస్పత్రులూ మూతపడ్డాయి. ప్రైవేట్‌ వైద్యులు, సిబ్బంది ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే చిన్ని మాత్రం ఇంటికి వెళ్లలేదు. నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. ‘నేను కరోనా బాధితులకు సేలు అందిస్తాను… అవకాశం ఇవ్వండి’ అని అడిగారు. దీంతో గాంధీ ఆస్పత్రి అధికారులు అతన్ని విచిత్రంగా చూశారు. అందరూ కరోనాకు దూరంగా వెళ్లిపోతుంటే…నువ్వేమిటి కరోనా ముంగిట్లోకి వస్తున్నావు అని ప్రశ్నించారు. అయినా ఆ విధంగా పని చేయించుకోవాంటే చాలా అనుమతులు అవసరం అవుతాయంటూ అవకాశం కల్పించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగారు చిన్ని.

హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అప్పటికే లాక్‌డౌన్‌ మొదయింది. 14 గంటలు నిర్విరామంగా ప్రయాణించిన అనంతరం ఇంటికి చేరుకున్న చిన్ని…నేరుగా చిత్తూరు జిల్లా వైద్యాధికారి పెంచలయ్యను కలిశారు. తన ఆకాంక్షను వెలిబుచ్చారు. ఆ తరువాత కలెక్టర్‌ భరత్‌ గుప్తాను కలిశారు. తాను చేయానుకుంటున్న సేవ గురించి వివరించారు. కలెక్టరూ ఆశ్చర్యపోతూ… ఇంతకీ నువ్వు ఏమి ఆశిస్తున్నావు అని ప్రశ్నించారు. ‘నేను ఏమీ ఆశించడం లేదు. నాకు భారత సైన్యమే స్ఫూర్తి. వారిలాగా నేనూ సేవ చేయానుకుంటున్నాను. కరోనా బాధితుకు సేవలు అందించే క్రమంలో నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు. నా భౌతికకాయంపై జాతీయ జెండా కప్పితే చాలు.’ అని భావోద్వేగంతో చెప్పారు.

చిన్ని నిజాయితీని, నిబద్ధతను గమనించిన కలెక్టర్‌ అతనికి కాణిపాకంలోని క్వారంటైన్‌ సెంటర్‌లో పనిచేసే అవకాశం కల్పించారు. కొన్ని రోజుకే అక్కడ క్వారంటైన్‌ సెంటర్‌ ఎత్తేసిన తరువాత….తిరుపతి సమీపంలోని తిరుచానూరులో ఏర్పాటు చేసిన పద్మావతి క్వారంటైన్‌ సెంటర్‌కు చేరుకున్నారు. దాదాపు 60 రోజు నుంచి అక్కడే ఉంటున్నారు.

ఇప్పుడు అక్కడ చిన్ని చాలా కీకంగా మారిపోయారు. నర్సింగ్‌ సేవలు తెలిసి ఉండటం, మనోస్థయిర్యాన్ని నింపే నైపుణ్యం కలిగివుండటం, తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు నాలుగు భాషలు తెలిసివుంటంతో చిన్ని సేవలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ‘కరోనా లక్షణాతో క్వారంటయిన్‌ సెంటర్‌కు వచ్చేవారి మనసిక స్థితి చాలా గందరగోళంగా ఉంటుంది. కుంగుబాటులో ఉంటారు. ఈ వ్యాధి తనకే ఎందుకు వచ్చిందా అనే వేదన ఉంటుంది. ఇంత సంపాదించిన, ఇంత సాధించిన తనకు వ్యాధి రావడం శాపమా అని మానసికంగా కుంగిపోతుంటారు. అసలు ప్రాణాలు నిలుస్తాయా అని భయపడుతుంటారు. ఈ పరిస్థితుల్లో వారికి మనోనిబ్బరం కలిగించడం ఎంతో అవసరం. కరోనా సోకి చనిపోయిన వారికంటే నయమైన వారు ఎంత ఎక్కువగా ఉన్నారో వారికి చెబుతాను. వారి మనసు నుంచి ఆందోళన దూరం చేస్తాను. క్వారంటయిన్‌ సెంటర్‌లో ఉన్ననన్ని రోజులూ హాయిగా, ప్రశాంతంగా ఉండమని చెబుతాను’ అని చెప్పారు చిన్ని. వ్యాధి కంటే భయమే మనిషిని చంపేస్తుంది. ఆ భయం దూరం చేయడమే నా పని క్లుప్తంగా చెప్పారు ఆయన.

ప్రతి రోజూ ప్రతి వ్యక్తి గదికి వెళ్లడం, వారికి స్వస్థత చేకూర్చే మాటలు చెప్పడం తన పని అని వివరించారు. ఈ సెంటర్‌లో వందల మందికి కౌన్సింలింగ్‌ వచ్చారు. రేణిగుంట ప్రాంతంలోని పరిశ్రమల్లో పనిచేసేవారు,  తమిళనాడు సరిహద్దు ప్రాంతాకు చెందిన వారు ఇక్కడికి ఎక్కువగా రావడంతో…. వారికి హిందీ, తమిళం భాషల్లో చెప్పడంతో ఎంతో ఊరటపొందారని అక్కడ పని చేస్తున్నవారు చెప్పారు. తనను కలెక్టర్‌ భరత్‌ గుప్త, వైద్యాధికారి పెంచయ్య, క్వారంటైన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జి క్ష్మి, చంద్రగిరి శాసన సభ్యు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారని కృతజ్ఞతా పూర్వకంగా చెప్పారు చిన్ని. ఇక్కడ చిన్ని తల్లి మల్లిక గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కుమారుడు చావుకు ఎదురెళ్లుతుంటే… భయపడిన ఆమె మొదట్లో వారించారు. తన లక్ష్యం, ఆశయం గురించి వివరంగా చెప్పడంతో ఆమె కూడా సంతోషంగా కుమారుడిని కరోనా విధులకు పంపించారు.

మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం స్వస్థత, పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాన్నది తన లక్ష్యమని చెప్పుకొచ్చారు చిన్ని. అదేవిధంగా మత్తు పదార్థాల వాడకం నుంచి విముక్తి కలిగించే డీఅడిక్షన్‌ సెంటర్‌ ప్రారంభించాన్నది కూడా తన లక్ష్యమని తెలిపారు. విదేశాకు వెళ్లానుకున్న తన గమ్యాన్ని కరోనా పూర్తిగా మార్చేసిందని, కరోనా బాధితులకు సేవలు అందించే అవకాశం లభించిందని ఎంతో సంతృప్తి నిండిన స్వరంతో ధర్మచక్రంకు చెప్పారు చిన్ని. హ్యాట్సాప్ టు చి‌న్ని. – ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*