ప్రైవేటు కాలేజీలకు జగన్ చెక్..!

ప్రయివేటు ఇంటర్ కాలేజీల అక్రమాలకు చెక్ పెట్టేలా జగన్ ప్రభుత్వం ‌నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యా సంసవత్సరం నుండి ఇంటర్‌ అడ్మినిస్ట్రేషన్లూ ఆన్ లైన్లో నిర్వహించాలని, ఫీజులు కూడా విధిగా ఆన్ లైన్ లోనే కట్టించుకోవాలని తీసుకున్న నిర్ణయం నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్ కాలేజీలకు శరాఘాతం కానుంది.

ఇప్పటి వరుకు ప్రయివేటు ‌కాలేజీలు అడ్మిషన్లలో ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తున్నాయి. రిజర్వేషన్లు అమలు కావడం లేదు. పేదలు ఈ కాలేజీల జోలికి వెళ్లడం లేదు. ఐఐటి, ఎంసెట్, నీట్ పేరుతో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫీజులు కూడా నగదు రూపంలో మాత్రమే వసూలు చేసుకుంటున్నాయి. ఆన్ లైన్ లో చెల్లిస్తామన్నా ఒప్పుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం గట్డి నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ పద్ధతిలో అడ్మిషన్లు నిర్వహిస్తే….మంచి మార్కులు వచ్చిన వారు ఎవరైనా సీటు దక్కించుకోవచ్చు. ఈ క్రమంలో రిజర్వేషన్లు కూడా అమలవు తాయి. ఈ పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాల పాత్ర పరిమితం అవుతుంది. ఫీజులు కూడా ఆన్ లైన్ లో తీసుకోవడం వల్ల అదనంగా వసూలు చేసే అవకాశం ఉండదు.

ఒకవిధంగా చెప్పాలంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమనే చెప్పాలి. ఇప్పటి దాకా ప్రయివేటు యాజమాన్యాలు ఇంటర్ బోర్డును శాసిస్తున్నాయి. ఇక బోర్డు అధికారులు కాలేజీలను శాసించే రోజులు రానున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*