ప్ర‌దీపూ…అమ్మాయిలంటే ఆట‌బొమ్మ‌ల‌నుకున్నావా…!

టెలివిజన్‌లో రియాల్టీ షోలకు ప్రాధాన్యత పెరుగుతోంది. సృజనాత్మకంగా నిర్వహించే షోలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ రియాల్టీ షోలు పాటలు, నృత్యాలు, సాహస క్రీడలు వంటివాటిని మించి భార్యాభర్తల గొడవలపై మధ్యస్తాలు దాటి, బిగ్‌బాస్‌ షో దాటి… ఇప్పుడు పెళ్లి చూపుల దాకా వచ్చేసింది. స్టార్‌ మా టీవీలో ఈ ఆదివారం రాత్రి (30.09.2018) 9 గంటల నుంచి ‘ప్రదీప్‌ పెళ్లిచూపులు’ పేరుతో ఓ రియాల్టీ షో మొదలయింది.

ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం ఈ టివి షో నిర్వహిస్తున్నాడట. దీనికి సంబంధించి గత కొన్ని రోజల నుంచి ప్రకటన ఇస్తున్నారు. టివి షో ద్వారా ప్రదీప్‌ తన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారని, ఆసక్తి కలిగిన యువతులు పేర్లు నమోదు చేసుకోవాలని చెబుతూ వచ్చారు. ఆదివారం రాత్రి మొదటి ఎపిషోడ్‌ ప్రసారమయింది.

ఈ షోకోసం హైదరాబాద్‌లో రాజకోట వంటి భారీ సెట్టింగు వేశారు. కొందరు యువతులు ఆ రాజకోటకు వచ్చారు. ప్రదీప్‌ అక్కడ నిలబడి అందర్నీ ఆహ్వానించి లోనికి పంపారు. ఆ యువతులతో మాట్లాడిన తరువాత తనకు సరిపోయే జోడీ ఎవరో నిర్ణయించుకుంటాడట. దీనిపై అప్పుడు విమర్శలు మొదలయ్యాయి. అమ్మాయిలంటే ఆటబొమ్మలనుకున్నావా ప్రదీప్‌…టివిలో పెళ్లిచూపులేమిటి? అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తనకు అన్నీ ఇచ్చిన టివి…జీవిత భాగస్వామినీ ఇస్తుందన్న నమ్మకంతో ఈ షోకు పూనుకున్నట్లు ప్రోమోలోనే ప్రదీప్‌ చెప్పారు. పురుషుడు పెళ్లి చూపులకు వెళ్లడం…అమ్మాయిలను చూడటం, నచ్చలేదని వచ్చేయడం…ఇదంతా పురుష ఆధిపత్య భావజాలానికి ప్రతీకగా భావిస్తూ దీన్ని అసహ్యించుకుంటున్నవారు ఉన్నారు. అటువంటిది టివి తెరపై పెళ్లి చూపులకు సిద్దమైన ప్రదీప్‌ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

ఈ షోలో పాల్గొనే అమ్మాయిలు ప్రదీప్‌ను మెప్పించాలట. అందరితో మాట్లాడి తనకు సరిజోడి ఎవరో ప్రదీప్‌ నిర్ణయించుకుంటారట. ఈ షోకు వచ్చిన అమ్మాయిలంతా….ఈ క్షణంలో ప్రదీప్‌ తమను పెళ్లిచేసుకుంటే చాలనేవిధంగా వ్యవహచింరారు. రానున్న ఎపిషోడ్స్‌లో ఎలాంటి వికారపు చేష్టలు చూడాల్సివస్తుందో…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*