బంగారం వివాదం : ఎన్నికల‌ అధికారుల సర్టిఫికెట్ చెల్లదు !

చెన్నై నుండి తరలిస్తుండగా పట్డుబడిన బంగారానికి సంబంధించి టిటిడికి, పంజాబ్ నేషనల్ బ్యాంకునకు తమిళనాడు ఎన్నికల అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినట్లు చెబుతున్నారు.‌

ఈ వివాదంలో క్లీన్ చిట్ ఇవ్వాల్సింది ఎన్నికల అధికారులు కాదు. ఎన్నికల సంఘానికి సంబంధం లేని అంశం.

టిటిడి డాక్యుమెంట్లతో దొంగ బంగారం తరిలించారన్నది ప్రధానమైన ఆరోపణ. కొందరు టిటిడి అధికారులు, పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు, రవాణా చేస్తున్న లాజిస్టిక్ సంస్థకు చెందిన వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలున్నాయి.

దీన్ని నిగ్గు తేల్చాలంటే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఏమి జరిగిందనేదానిపై లోతయిన విచారణ జరపాలి. అలాంటి విచారణ ఏదీ ఇప్పటిదాకా జరగలేదు. ఇది సాధారణ పోలీసులు, ఎన్నికల అధికారుల వల్ల సాధ్యమయ్యే పని‌కాదు. సిబిఐ వంటి సంస్థలు చేయాల్సిన పని.

ఇక టిటిడి వైపు నుండి స్పష్టత రావాల్సిన అంశాలు ఏమంటే….బంగారం టిటిడి ఖజానాకు వచ్చినపుడు తూకం వేశారా…ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు…ఎంత బంగారు ఉంది…అనేది చెప్పాలి.‌ బంగారాన్ని లోనికి తీసుకెళ్లినప్పటి నుండి తూకం వేసేదాకా మొత్తం ప్రక్రియ కు సంబంధించిన సిసి పుటేజీలు విడుదల చేయాలి.

అప్పుడే ఎవరికైనా క్లీన్ చిట్ ఇవ్వడం సాధ్యమవుతుంది. తమిళనాడు ఎన్నికల సంఘం, మన్మోహన్ సింగ్ ఇచ్చే సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*