బర్డ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆవిర్భావం

తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నూతన అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చాలా ఏళ్లుగా అవుట్ సోర్సింగ్ పద్ధతులో పని చేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులు ఏకమై బర్డ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (బోస్) ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ తొలి కార్యవర్గ సమావేశం యశోదా నగర్ లోని ఎంబి భవన్ లో జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉండాలని తీర్మానించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టి టిడిడి స్టాఫ్ అండ్ వర్కర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు ఎం.నాగార్జున, టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు డైరెక్టర్ కె.గుణశేఖర్, టిటిడి అటెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పట్నం దయాకర్, పి.శ్రీనివాసులు, టిటిడి‌ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు సుబ్రహ్మణ్యం హాజరయ్యారు.

బర్డ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షులు నక్క దిలీప్, ఉపాధ్యక్షులు పి.శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ప్రియా తదితరులు పాల్గొన్నారు. బర్డ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*