బలిజల్లో ఒక్కడిగా ఉంటా… శ్రీకాళహస్తిలో శ్రీకృష్ణదేవరాయల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా : ఎంఎల్ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి

జగనన్న ప్రభుత్వం “వై.ఎస్.ఆర్ కాపునేస్తం” పథకం కింద “బలిజ” అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా శ్రీకాళహస్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లో బలిజ సంఘం నాయకులు…ముఖ్యమంత్రివైయస్ జగన్మోహన్ రెడ్డి కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించి, కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో 90 శాతం పైగా కాపులు తమకు అండగా నిలిచారని, వారికి రుణపడి ఉంటానని అన్నారు. బలిజ ,‌ కాపు , తెలగ, ఒంటరి కులాల వారికి ఆర్థిక చేయూత ఇవ్వడానికి మన జగనన్న “వై.ఎస్.ఆర్ కాపు నేస్తం” కింద 15000/- అందించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరోనా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న కాపు కుటుంబాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందడంతో వారందరూ ఎంతో ఆనంద పడుతున్నారని తెలిపారు. త్వరలో శ్రీకాళహస్తిలో శ్రీ కృష్ణ దేవరాయల కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానని, కాపులకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్నిస్తానని ఎంఎల్ఏ హామీ ఇచ్చారు.

కాపు‌ సంఘం నాయకులు పోకల అశోక్ కుమార్ మాట్లాడుతూ జగనన్న కాపు కాపు సామాజిక వర్గానికి 2,846 కోట్లు ఆర్థిక సహాయం అందించినందుకు వారికి రుణపడి ఉంటామని, ముఖ్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి అండగా ఉన్న బియ్యపు మధుసూదన్ రెడ్డికి కాపు కులస్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. వైసిపి నేత అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆ రోజు వైఎస్ఆర్, ఈరోజు జగన్ అన్న రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని ఆదరిస్తున్నారని, శ్రీకాళహస్తిలో బలిజ కుటుంబ సభ్యులలో ఒకరిగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బలిజలకు చేయూతనిస్తున్నారు చెప్పారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో లో ప్రతి ఇంటికి 15 సార్లు నిత్యావసర సరుకులు,కూరగాయలు, టాబ్లెట్స్ అందించారని ,30 సంవత్సరాల రాజకీయం చేసిన బొజ్జల కుటుంబం శ్రీకాళహస్తి ప్రజలకు ఏమీ చేయకపోగా కనీసం వారి సొంత గ్రామం ఉరాందుర్ లో నిత్యవసర వస్తువుల అందించలేదని, మనసున్న మంచి వ్యక్తిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్ని వర్గాల హృదయాల్లో నిలిచిపోతారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్వనాధం,ఆకుల గజేంద్ర, గాజుల సత్యం, సిద్ధులుగారి జయబాబు, చిట్టివేలు సుబ్బారావు, పగడాల రాజు, బుల్లెట్ జయష్యం, శేఖర్, స్వర్ణమూర్తి, కంటఉదయ్, శరవణ, గరికపాటి చంద్ర ,మున్నా ,లీల తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*