బాబును చెడుగుడు ఆడేస్తున్న సోషల్‌ మీడియా!

ఒప్పుడు మీడియా చూపించిందే వార్త. ప్రధాన పత్రిలు రాసినదే వార్త. ఇప్పుడు అలాకాదు. సోషల్‌ మీడియా విస్తృతం అయ్యాక ప్రధాన ప్రసంతి మీడియా విస్మరిస్తున్నా ఎన్నో అంశాలను వెలికితీస్తోంది. స్వార్థ ప్రయోజనాల రీత్యానో, ఇష్టం లేకనో చూపించని, ప్రచురించని అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వచ్చేస్తున్నాయి. ఎంతో సునిశిత పరిశీలన, సృజనాత్మకతతో రాస్తున్నారు. తిరుపతిలో జరిగిన ధర్మపోరాట సభలో చంద్రబాబు నాయుడు ఒక పదంలో నోరు జారినందుకు ఆయన్ను…సోషల్‌ మీడియా చెడుగుడు ఆడేస్తోంది.

తిరుపతి సభలో చంద్రబాబు మాట్లాడుతూ….స్వాతంత్య్రోదమంలో పోరాడ ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీని అన్నారు. దీనిపైన సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవంగా ఆయన చెప్పాలనుకున్నది వేరు. స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్‌ వాళ్లతో పోరాడిన చరిత్ర తెలుగుజాతిది అని చెప్పాలనుకున్నారు. వాఖ్య నిర్మాణంలో చోటు చేసుకున్న గందరగోళం కారణంగా బ్రిటీష్‌ వాళ్లతో పోరాడిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీని అనేశారు. ఇది యథాలాఫంగా జరిగింది. దీన్ని టివిల్లో పట్టుకున్న నెటిజన్లు తమ సృజనాత్మకతనంతా ఉపయోగించి సెటైరికల్‌ విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవిస్తే, అంతకంటే 40 ఏళ్లు ముందు జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఎలా పాల్గొంది అని ప్రశ్నించారు. కొందరైతే…గాంధీ సత్యాగ్రహంలో కూర్చున్న పాత ఫొటోలను బయటకు తీసి, మధ్యలో చంద్రబాబు ఫొటోను ఇరికించారు. ఇంకో ఫొటో నేతాజీ సుబోష్‌ చంద్రబోస్‌ సైనిక దుస్తుల్లో నడుస్తున్న ఫొటోను తీసుకుని, పక్కన లోకేష్‌ ఫొటోను అతికించారు. ఇలాంటి అనేకం సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడే కాదు…ఏ రాజకీయ నాయకుడైనా ఇక మాట్లాడేముందు మీడియానే కాదు…సోషల్‌ మీడియానూ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. లేకుంటే బాబు బుక్‌ అయినట్లు బుక్‌ అయిపోతారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*