బాబు గోగినేనికి జైలుశిక్ష!

తాను నిర్వహించే హేతువాద ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యేవారి నుంచి ఆధార్ కార్డుల వివరాలు సేకరించి సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించారని, మతాల మధ్య చిచ్చుపెట్టేలా విద్వేషపూరిత ఉపన్యాసాలు చేస్తున్నారంటూ…కేసులు ఎదుర్కొంటున్న బాబు గోగినేని జైలు పాలయ్యారు. ఇంకా కేసు కోర్టుకు వెళ్లలేదు విచారణ జరగలేదు అప్పడే జైలు శిక్ష ఏమిటి అనేదే కదా మీ అనుమానం. అవును మీ సందేహం కరెక్టే. కొందరు గిట్టనివారు బాబు గోగినేనిపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇప్పటి దాకా ఆ కేసుల గురించి బిగ్ బాస్ లో ఉన్న బాబుకు సమాచారం కూడా తెలియదు. ఆ కేసులు నిలబడవని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక జైలు శిక్ష విషయానికొస్తే ఇది…బిగ్ బాస్ హౌజ్ సంగతి. ఇంటిలో తెలుగు మాత్రమే మాట్లాడాలన్న నిబంధనకు విరుద్ధంగా ఇంగ్లీషు మాట్లాడుతున్న కారణంగా బాబు గోగినేనికి శిక్ష విధించారు. పగటి పూట నిద్రపోతున్నారన్న కారణంగా తనిష్ కూడా శిక్షకు గురయ్యారు. ఇద్దరినీ ఇంటిలోపల ఉన్న జైలుకు పంపించారు. ఇదీ గోగినేని జైలు శిక్ష కత.

ఇదిలావుండగా ఈ వారానికి కెప్టెన్ ఎంపిక కోసం బిగ్ బాస్ ఆసక్తికర పోటీ నిర్వహించారు. కిరీటి, రోల్ రైడా, గణేష్ మధ్య బిరియానీ తినే పోటీ పెట్టారు. ఒకొక్కరి ముందు పెద్ద పాత్ర నిండా బిరియానీ పెట్టారు. ఈ పోటీలో గణేష్, రైడా గట్టిగా పోటీపడ్డారు. చివరిగా రోల్ రైడా గెలిచారు. కెప్టెన్ గా ఎంపిక య్యారు. రైడా ఎంపికవగానే…ఇంటి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇద్దరు సభ్యులను గుర్తించి జైలుకు పంపమని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో బాబు గోగినేని, తనిష్ పేర్లను రైడా చూచించారు. ఆ ఇద్దరూ జైలుకెళ్లారు. తన వద్ద ఉన్న కార్డు ద్వారా జైలు శిక్ష తప్పిస్తానని కౌసల్ వెళ్లి గోగినేనికి చెప్పినా ఆయన అంగీకరించలేదు. తాను నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లీషు మాట్లాడానని, తాను శిక్ష అనుభవిస్తానని ఆయన చెప్పారు. ఇదీ బిగ్ బాస్ ఇంట్లో 19 వ రోజు సంగతులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*