బాబు గోగినేని టార్గెట్ ! నాని అనైతిక చర్య!

ప్రముఖ హేతువాది, మానవవాది… అన్నింటికీ మించి టివి ఛానళ్ల వేదికగా దొంగస్వాముల తాటతీసి డోలువాయించిన బాబు గోగినేనిని బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకు పంపడానికి షో నిర్వాహకులే కుట్రలు చేస్తున్నారా…ఇందులో హోస్ట్ నాని కూడా భాగస్వామి అవుతున్నారా…అంటే అవుననే అంటున్నారు ఆయన అభిమానులు. ఇందుకు శనివారం నాటి ఎపిషోడే తార్కాణంగా చూపుతున్నారు. దీనికి సంబంధించి పేస్ బుక్ లో ఓ అభిమాని రాసిన పోస్టు ముందుగా చదవండి….

“పెద్ద దొర” షో లో “చిన్న దొర” కుప్పి గంతు
—————————————————
నిన్నటి బిగ్ బాస్ షోలో బాబు గోగినేని ని లక్ష్యంగా హోస్ట్ నాని ఏదో తప్పు పట్టాలని నానా తిప్పలు పఢాడు… కానీ సఫలం కాలేదు.

అసలు విషయం ఏమిటంటే….!

“తేజస్వి చెప్పిందని ఎలిమినేషన్ ఓటు టి.వి.9 దీప్తికి ఎలా వేశావు? తేజస్వి నీకు అబద్దం చెప్పి ఉండవచ్చుగా! కౌశల్ చెపితే అలాగే నమ్మేవాడివా? ఎవరో చెప్పింది నమ్మటం ఏమిటీ…. మీకు సొంత ఆలోచన లేదా?” అనేది నాని ప్రశ్న.

“తేజస్వి మాట నమ్ముతాను…. కౌశల్ మాట నమ్మను” ముఖం మీద కొట్టినట్టు చెప్పాడు బాబు గోగినేని.

ఓటింగ్ అనేది రహస్యంగా జరిగిన ప్రక్రియ. ఆమెకు ఎందుకు ఓటు వేస్తున్నావో వివరణ ఇవ్వాలన్నది ” పెద్ద దొర” నియమం. అందులో భాగంగా…. ఏదో ఒకటి చెప్పాలి కనుక చెప్పాడు.

దీనిలో తప్పు పట్టటానికి ఏమీ లేదు…. కానీ, ప్రేక్షకుల్లో బాబు గోగినేని మీద తప్పుడు అభిప్రాయం కలిగించటానికి నాని ఒక కుప్పి గంతు ప్రయత్నం చేసాడు. రహస్య వోటింగ్ వివరాలను బయటపెట్టి చర్చ పెట్టటం… హోస్టు నాని చేసిన నీతిలేని చర్య.

గతంలో జరిగిన ఓటింగులో…. టివి9 దీప్తి బాబుకు ఓటు వేస్తూ ” బాబు గోగినేని కనిపించే అంత పెద్దరికం ఉన్నవాడు కాదు కనుక వోటు వేస్తున్నాను” అంది. అప్పుడు నాని ఆమెను “అమ్మా ! నీకు విపరీతమైన భక్తి నమ్మకాలు ఉన్నాయని… నీ ఎ.వి ప్రోమోలో చెప్పుకున్నావు… బాబు గారు అందుకు భిన్నమైన వారు కనుక అలా అనటం తప్పు” అని చెప్పి ఉంటే… ఇప్పుడు నాని వైఖరిని తప్పు పట్టటానికి అవకాశం ఉండేది కాదు.

దీన్ని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే … బయట బాబు గోగినేని మీద జరుగుతున్న దుష్ప్రచారం ప్రభావం నానికి బాగానే అంటుకుందనీ…. బాబు గోగినేని ఎలిమినేట్ చేయటానికి…. రహస్య వోటు ప్రక్రియలోకి అనైతికంగా దూరి… అతనిపైన చెడు అభిప్రాయం జనాలలో కలిగించటానికి ఒక కుప్పి గంతు వేసాడని.

బాబు గోగినేని …షోలో బాధ్యుతాయుతంగా ఉన్నాడు కనుక… నీ కుప్పి గంతు క్షేమంగా బయట పడింది. పండగ చేసుకో..

————————————————-

నిజమే కదా….ఎలిమినేషన్ కోసం నిర్వహించే నామినేషన్ ప్రక్రియ రహస్యం. ఎవరు ఎవరిని నామినేట్ చేశారో ప్రేక్షకులకు తప్ప ఇంటి సభ్యులకు తెలియదు. ఒక వేళ బిగ్ బాసే బహిరంగంగా ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహిస్తే అది వేరే సంగతి.‌ గత వారం రహస్యంగానే జరిగింది. అలాంటప్పుడు బాబు గోగినేని దీప్తికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని నాని బయటకు ఎందుకు చెప్పాలి? నామినేషన్లు గురించి చర్చించకూడదని బిగ్ బాసే అనేకసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.

అయినా ఎవరు ఉండాలో ఎవరు వెళ్లాలో ప్రేక్షకులే నిర్ణయించేటప్పుడు మధ్యలో నాని జోక్యం ఏమిటని ప్రశ్నిస్తున్నవాళ్లూ ఉన్నారు. ఎవరినైతే ఎలిమినేట్ చేయదలిచారో వారిపైన ప్రేక్షకుల్లో చెడు అభిప్రాయం కలిగించడాని నాని ప్రయత్నిస్తున్నారన్న విమర్శలకు శనివారం నాటి ఎపిసోడ్ తాజా ఉదాహరణ. దీప్తి ఎలిమినేట్ అయితే దానికి బాధ్యత గోగినేనిదే అని చెప్పే సాహసం కూడా చేశారు నాని. అంటే దీప్తి ఎలిమినేట్ కాకూడదనా…కాదనా..? బిగ్ బాస్ గాడి తప్పుతున్న సంగతి అందరికీ అర్థమైపోతోంది. నాని నిజాయితీ గా ఉండకపోతే ఈ షో ద్వారా అతని వ్యక్తిత్వం బయటపడుతుంది.

4 Comments

Leave a Reply

Your email address will not be published.


*