బాబు చక్రం తిప్పడం సాధ్యమేనా?

2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పుతుందని, టిడిపి నిర్ణయించిన వ్యక్తే ప్రధాన మంత్రి అవుతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో టిడిపిని గెలిపిస్తే కేంద్రాన్ని శాసించే పరిస్థితి వస్తుందని అంటున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి ఎన్ని లోక్‌సభ స్థానాల్లో గెలుస్తుంది?…అన్నీ గెలిచినా కేంద్రంలో చక్రం తిప్పగల పరిస్థితి ఉంటుందా? అనేవి పరిశీలించాల్సిన అంశాలు.

వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని ఇప్పటికే తేలిపోయింది. తెలుగుదేశం, వైసిపి రెండుపక్షాలుగా ఉంటాయి. పవన్‌, వామపక్షాలు మూడోపక్షంగా బరిలో ఉంటాయి. ఇక కాంగ్రెస్‌ పోటీలో ఉన్న అది చూపగల ప్రభావం పరిమితమే. త్రిముఖ పోటీలో టిడిపికి ఎన్నిసీట్లు వస్తాయో చెప్పలేని పరిస్థితి. గతంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినపుడు టిడిపికి 39 స్థానాలున్నాయి. అప్పుడు బిజెపికి అత్తెసురు స్థానాలు మాత్రమే ఉండటం వల్ల టిడిపికి చెందిన 39 మంది ఎంపిలు కీలకమయ్యారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఉన్నదే 25 స్థానాలు. ఇప్పుడున్న స్థానాలను నిలుపుకోవడమే టిడిపికి కష్టంగా మారింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయినా….టిడిపి ఒక పార్టీగా ఉంటుంది తప్ప….బలమైన భాగస్వామిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు చక్రం తిప్పగలనని బాబు ఎలా అనుకుంటున్నారో అంతుపట్టదు. పార్టీ శ్రేణులను ఉత్సామపరచడం కోసం బాబు ఆమాట చెప్పవచ్చుగానీ…నిజంగా గతంలో మాదిరి చక్రం తిప్పగల పరిస్థితి టిడిపికి ఉండకపోవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*