బాబు చెయ్యి ఊపుడు మారింది!

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రెండు వేళ్లు (విక్టరీ సింబల్‌) చూపిస్తుంటారు. విజయానికి సంకేతం అది. బెంగుళూరులో జరిగిన కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవ సభలో మాత్రం చంద్రబాబు నాయుడు రెండు వేళ్లకు బదులు ఐదువేళ్లు చూపిస్తూ అభివాదం చేశారు. చంద్రబాబు విక్టరీ సంకేతం గురించి తెలిసినవాళ్లు ఆశ్చర్యపోయారు. ఇంతకీ బాబు చెయ్యి ఊపుడులో ఎందుకు మార్పు వచ్చినట్లు?

బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు దగ్గరవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుంటాయని కూడా చెబుతున్నారు. ఈక్రమంలోనే….కాంగ్రెస్‌-జెడిఎస్‌ కూటమి తరపున కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఉత్సవానికి దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల నేతలను అతిథులుగా ఆహ్వానించారు. ఈ సభలో కాంగ్రెస్‌ అధినాయకులు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కూడా వచ్చారు. రాహుల్‌ గాంధీని చంద్రబాబు భుజం తట్టి అభినందించిన ఫొటోలు సభ జరుగుతున్నపుడే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. కాంగ్రెస్‌తో కొత్తగా ఏర్పడుతున్న అనుబంధానికి గుర్తుగా చంద్రబాబు నాయుడు రెండు వేళ్లు కాకుండా…కాంగ్రెస్‌ గుర్తు హస్తం చూపించారని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానాలు వస్తున్నాయి.

2 Comments

  1. Its a natural human tendancy that shatruvu shatruvu mitrudu. Chandra Babu Naidu is also as a humanbeing, may be, his tendancy may go the way it likes.

  2. One thing is true that the Central Govt cheated the people of AP by not giving special Hoda, hence the BJP, Central ruling party is a shatruvu(enemy) for all Telugu people unless it is waken even now.

Leave a Reply

Your email address will not be published.


*