బాబు లాయర్‌ కూడానా..!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో మంచి న్యాయవాది కూడా ఉన్నారు. కోర్టులో తానే వాదించుకోగలనని ఆయన అంటున్నారు. ఇది తనకు కొత్తేమీ కాదని చెబుతున్నారు. ఇంతకీ విషయం ఏమంటే…అక్రిగోల్డ్‌ బాధితుల అంశం నిన్న మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ….’కోర్టులో వాదించడం మీకు చేతకాకపోతే చెప్పండి….నేనే వచ్చి వాదించుకుంటాను. ఇది కొత్తేమీ కాదు. బాబ్లీ ప్రాజెక్టుపై మహారాష్ట్రలో ధర్నా చేస్తే అక్కడి పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మీరు న్యాయవాదిని పెట్టుకుంటారా అని జడ్జి అడిగితే…మా రాష్ట్ర సరిహద్దుల్లో ఆందోళన చేస్తుటే అరెస్టు చేశారు…మా కేసును నేనే వాదించుకుంటా అని చెప్పాను’ అంటూ అధికారులకు చెప్పారట. అవసరమైతే ఢిల్లీ నుంచి న్యాయవాదులను పిలిపించుకోవాలని సూచించారట.

అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆగ్రిగోల్డ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల వేలంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రభుత్వమే కావాలని కాలయాపన చేస్తుందన్న విమర్శలున్నాయి. రాజధానికి చుట్టూవున్న అగ్రిగోల్డ్‌ భూములను వేలం వేయడానికి సింగపూర్‌ కంపెనీలతో సమస్యలున్నాయని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో సింగపూర్‌ కంపెనీలకు ఇచ్చిన భూమిలో ఆ సంస్థలు వేసే ప్లాట్లు విక్రయించేదాకా…చుట్టూ ఎలాంటి రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులనూ అభివృద్ధి చేయకూడదన్న నియమం ఉందట. అందుకే అగ్రిగోల్డ్‌ భూములను ఎవరికీ విక్రయించకుండా జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యమంత్రి మాత్రం అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే….ఆయన ‘మీకు చేతకాకుంటే చెప్పండి…నేనే కోర్టుకు వచ్చి వాదిస్తాను’ అని వ్యాఖ్యానించినట్లు ఓ దినపత్రిక ప్రచురించింది.

1 Comment

  1. కోర్టులో వాదించడమంటే అసెంబ్లీలో చేసే తలతిక్క వాదనలు అనుకొన్నాడేమో ఈయన..!!

Leave a Reply

Your email address will not be published.


*