బాబు విచిత్ర వ్యాఖ్యలు!

కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వం సరిగా నిర్వహించడం లేదంటూ…’మీరు పట్టించుకోకుంటే…జాతీయ రహదారులనూ మేమే వేసుకుంటాం…రాష్ట్ర రహదారులని బోర్డులు పెట్టుకుంటాం’ అని అన్నారు. కలెక్టర్ల సమావేశంలో పర్యాకట రంగంపై చర్చిస్తున్న సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. జాతీయ రహదారులను కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంటుంది. ఇందుకోసం నేషనల్‌ హైవేవ్స్‌ అథారిటీ అనే సంస్థ కూడా అంది. దాని ఆధ్వర్యంలోనే జాతీయ రహదారుల నిర్మాణం, నిర్వహణ జరుగుతుంటాయి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందులోనూ ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్‌ రోడ్లు వేరువేరుగా ఉంటాయి. ఎవరి పరిధిలోని రోడ్లను వారు నిర్మిస్తారు. అవసరమైనపుడు మరమ్మతులు చేస్తారు. కేంద్రం జాతీయ రహదారులను సరిగా పట్టించుకోకుంటే…ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పని చేయించాలి తప్ప…మా నిధులతో మేమే జాతీయ రోడ్లూ వేసుకుంటాం, బోర్డులు పెట్టుకుంటాం అంటే కుదురుతుందా? ఇది జాతీయ సమైక్యతను దెబ్బతీసే చర్య కాదా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకులు సరిగా పని చేయకపోతే….రాష్ట్ర ప్రభుత్వం వాటిని జాతీయం చేయగలదా? ఆర్‌బిఐ నియంత్రలోనే బ్యాకులు పని చేస్తాయి. పోస్టల్‌ విభాగం సరిగా పని చేయకుంటే…ప్రత్యేక పోస్టల్‌ శాఖను రాష్ట్రం ఏర్పాటు చేసుకోగలరా? టెలికం సేవలు సరిలేనపుడు…సొంత టెలికం వ్యవస్థ రూపొందించుకోవడం అయ్యేపనేనా? రైళ్లు సమయానికి రావు. అందుకని సొంతంగా రైళ్లను ఏర్పాటు చేసుకుంటామా? ఏ ప్రభుత్వం బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ఆ బాధ్యతను విస్మరిస్తుంటే…పదేపదే చెప్పాలి. లేఖలు రాయాలి. అవసరమైతే జనాన్ని చైతన్యవంతులను చేసి ఆందోళనలు చేయించాలి. ప్రభుత్వాన్ని కదిలించాలి. అంతేతప్ప ముఖ్యమంత్రి స్వయంగా జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించే మాటలు మాట్లాడితే…ఇక సాధారణ జనం ఎలా మాట్లాడాలి? కేంద్రంపై అసహనాన్ని ఉండొచ్చుగానీ…ఇలాంటి వ్యాఖ్యల వల్ల పలచనయ్యేది మనమే అనేది ముఖ్యమంత్రి గుర్తించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*