బాలకృష్ణ పై శ్రీవారికి ప్రత్యేక అభిమానం..!

ముఖ్యమంత్రి చంద్రచాబు నాయుడి వియ్యంకుడు, సినీ నటుడు,‌ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ అంటే తిరుమల శ్రీవారికి ప్రేత్యేక అభిమానం‌ ఉందేమో అనిపిస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ఉండగా హిందూపురం నియోజకవర్గానికి కేటాయిస్తున్నన్ని నిధులు మరే ఇతర నియోజకవనికీ టిటిడి కేటాయించడం లేదు. బాలకృష్ణ నుంచి సిఫార్సు లేఖ అందినదే తడవుగా ఆలయాల పునరుద్ధరణ, కల్యాణమండపా పునరుద్ధరణ పేరుతో నిధులు కేటాయిస్తున్నారు.

తాజాగా మంగళవారం జరిగిన టిటిడి పాలకంమడలి సమావేశంలో హిందూపురం నియోజకవర్గం చేలూరులోని ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.27 లక్షలు మంజూరు చేశారు. గతంలో లేపాక్షి మండలం బింగిపల్లిలోని గుప్తకామేశ్వరి ఆలయ పునరుద్ధరణకు రూ. 1.60 కోట్లు కేటాయించారు. టిటిడి నిబంధనల ప్రకారం ఆలయాల పునరుద్ధరణకు గరిష్టంగా రూ.25 లక్షలు మాత్రమే కేటాయించడానికి అవకాశముంది. ఇంకా హిందూపురంలోని రంగనాథ స్వామి ఆలయానికి రూ.55 లక్షలు కేటాయించారు. అదేవిధంగా లేపాక్షి, చిలమత్తూరులో కల్యాణ మండపాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.1.45 కోట్లు కేటాయించారు. ధర్మచక్రంకు లభ్యమైన వివరాల మేరకే హిందూపురం నియోజకవర్గానికి మూడేళ్ల కాలంలో రూ. 5.30 కోట్లు దాకా కేటాయించారు.

పురాతన ఆలయాల పునరుద్ధరణకు నిధులు ఇవ్వడంలో తప్పులేదుగానీ దానికి పారదర్శక విధానాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. పలుకుబడి కలిగిన ఎంఎల్ఏలు సిఫార్సు చేస్తే నిబంధనలను పక్కనపెట్టి నిధులు ఇవ్వడం సరికాదు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఓ ఆలయానికి రూ.4.75 కోట్లు కేటాయించిన ఉదంతం కూడా ఉంది. ఇది ఉన్నత సిఫార్సు మేరకే జరిగిందనేది జహిరంగ రహస్యం. శ్రీవారి నిధల గురించి ఎవరూ ప్రశ్నించే పోవచ్చు గానీ స్వామివారు గమనిస్తుంటారన్న విషయాన్ని అధికారులు గమనంలో ఉంచుకోవాలని భక్తులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*