బావిలో 9 మృతదేహాలు…హత్యలా‌ ఆత్మహత్యలా…!!

తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా గీసుకొండ మండటం గొర్రెకుంటలోని ఓ బావిలో గురువారం నాలుగు మృతదేహాలు బయటపడిన సంగతి తెలిసుందే.‌ ఇదే బావిలో శుక్రవారం మరో ఐదు మృతదేహాలు కనిపించాయి. దీంతో బావిలో బయటపడిన మృతదేహాల సంఖ్య తొమ్మిదికి పెరిగింది

మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి వలస వచ్చిన కుటుంబం ఇరవై ఏళ్లుగా వరంగల్‌ కరీమాబాద్‌లో ఉంటోంది. చిరిగిన గోనెసంచులు కుడుతూ జీవనం‌ సాగిస్తున్న ఆ దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులు కలిసే ఉన్నారు. లాక్ క్‌డౌన్‌ నేపథ్యంలో పనిచేసే చోటకు వెళ్లిన ఆ కుటుంబం సభ్యులు మృతదేహాలుగా బావిలో కనిపించారు. ఇవి ఆత్మహత్యలా హత్యలా అనేది పోలీసు దర్యాప్తులో తేలాల్సివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*