బిగ్‌బాస్‌కు ఏ శిక్ష వేయాలో మీరే చెప్పండి..!

బిగ్‌బాస్‌ ఇంట్లో ఉండేవాళ్లు తెలుగులోనే మాట్లాడాలనేది నియమం. ఇంగ్లీషులో మాట్లాడిన ఇంటి సభ్యులను అనేక పర్యాయాలు హెచ్చరించారు, కొందరిని శిక్షించారు కూడా. ఎవరో ఇంగ్లీషులో మాట్లాడితే…ఇంటి కెప్టెన్‌గా ఉన్న సామ్రాట్‌ను స్విమ్మింగ్‌ పూల్‌లో దూకమని ఆదేశించారు బిగ్‌బాస్‌. ఇదంతా ఎందుకంటే…తన నియమాన్ని తానే మరచిపోయినట్లున్నారు. తన చెప్పదలచుకున్న విషయాలను తెలుగులో కాకుండా ఇంగ్లీషులో రాసి పంపుతున్నారు. ఇంతకీ విషయం ఏమంటే….

బిగ్‌బాస్‌ షో 71వ రోజు, సోమవారం రాత్రి ఎపిషోడ్‌లో బిగ్‌బాస్‌ కొన్ని కవర్లు లోపలకు పంపారు. ఎవరి పేరుపైన ఉన్న కవరును వారు తీసుకోవాలని చెప్పారు. అందులో…ప్రతి ఇంటి సభ్యుడి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో రాసివుందని, దానికి ప్రతి సభ్యుడు వివరణ ఇవ్వాలని బాస్‌ ఆదేశించారు. ఆ కవర్లు తెరచి చదవడం ప్రారంభించారు ఇంటి సభ్యులు. ఒక్క రోల్‌రైడాకు తప్ప…మిగిలిన అందరి కవర్లలోని అభిప్రాయాలు ఇంగ్లీషులో ఉన్నాయి.

తమపై వచ్చిన విమర్శలకు సభ్యులు తెలుగులో వివరణ ఇచ్చినా….అసలు వాస్తవంగా ఆ సభ్యులపై ఆరోపణలు ఏమిటో ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఎందుకంటే….అవన్నీ ఇంగ్లీషులో ఉన్నాయి. తెలుగులోనే మాట్లాడాలని చెప్పే బిగ్‌బాస్‌…ఇంటి సభ్యులపై జనాల్లో వ్యక్తమైన అభిప్రాయాలను తెలుగులో ఎందుకు రాసిపంపలేదు? ఒక వేళ అందరికీ తెలుగు చదవడం రాదనుకున్నా….తెలుగు చదవడానికి రాని అమిత్‌ వంటి వారికి కార్డులను ఎవరో ఒకరు చదివేవారు. లేదంటే…బిగ్‌బాస్‌ ఆ కార్డులను చదివి వినిపించివుండొచ్చు. అయినా….అభిప్రాయాలను ఇంగ్లీషులో ఎందుకు రాసి పంపినట్లు. ఇది తన నియమాన్ని తానే ఉల్లంఘించడం కాదా? అందరికీ శిక్షలు వేసే బిగ్‌బాస్‌కు ఎవరు శిక్ష వేయాలి?

ఇక ఈ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఒక్కో సభ్యున్ని యాక్టివిటీ రూంలోకి పిలిచి….ఎదురుగా ఒక్కో టివిలో ఒక్కో సభ్యుడు కనిపిస్తుండగా, తనకు నచ్చని సభ్యుని పేరు చెప్పి, ఎందుకు నచ్చలేదో వివరించి, ఆ టివిని ఆఫ్‌ చేయాలి. ఈ పద్ధతిలో ఎక్కువ మందిచేత టివిలు ఆఫ్‌ చేయబడిన పూజ, కౌశల్‌, తనిష్‌, దీప్తి ఈ వారం నామినేట్‌ అయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*