బిగ్‌బాస్‌ను తప్పుబట్టారో…జాగ్రత్త!

బిగ్‌బాస్‌ ఇంటిలో బాబు గోగినేని లోటు మొదటివారమే కనిపించింది. బిగ్‌బాస్‌ తీసుకునే అసంబద్ధ నిర్ణయాలను బాబు గోగినేని బాహాటంగా విమర్శిస్తూ వచ్చారు. బిగ్‌బాస్‌ కూడా ఆయన్ను ఏమీ అనలేకపోయారు. బాబు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన మొదటి వారమే బిగ్‌ బాస్‌ వార్నింగులు ఇచ్చారు. బిగ్‌బాస్‌ నిర్ణయాలను ప్రశ్నంచకూడదట. ప్రశ్నించారో బిగ్‌బాస్‌ ఆగ్రహానికి గురికాల్సి వస్తుందనే రీతిలో హెచ్చరించారు హోస్ట్‌ నాని. దీనికి సభ్యులంతా మారు మాట్లాడకుండా తలలు ఊపారు.

బిగ్‌బాస్‌ ఎప్పుడూ అరకొరగానే నిబంధనలు చెబుతారట. వాటిని అర్థం చేసుకుని టాస్క్‌లు ఆడాల్సిందే తప్ప…బాస్‌ నిర్ణయాన్ని ప్రశ్నించకూడదట. ఇదీ హోస్ట్‌గా నాని చెప్పిన మాట. టాస్క్‌లో గందరగోళం ఏర్పడటానికి, సభ్యులు కొట్టుకోడానికి వీలుగా బిగ్‌బాస్‌ ఎప్పుడూ అస్పష్టంగానే రూల్స్‌ చెబుతుంటారు. ఆ రూల్స్‌ ఎంత అస్పష్టంగా ఉన్నా భరిస్తూ, కొట్టుకుంటూ ఆడాల్సిందేగానీ ప్రశ్నించకూడదట. అలాంటప్పుడు నాని కూడా ఇంటి సభ్యులను ప్రశ్నించకూడదు. ఎవరికి అర్థమైన రీతిలో వాళ్లు అడుతారు. ఇలా ఆడావు, అలా ఆడావు అని ప్రశ్నించే అధికారాన్ని నాని కూడా కోల్పోతారు. అయినా అసంబద్ధంగా ఉన్న రూల్స్‌ను ప్రశ్నించకూడదని బహరంగంగా చెప్పడం సహేతుకం అనిపించుకోలేదు.

ఇదిలావుండగా శనివారం రాత్రి ఎపిషోడ్‌ అంత ఉత్సాహంగా, అంత ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఏమీ లేదు. సభ్యులకు చెప్పడానికి నాని వద్ద పెద్దగా పాయింట్లు ఏమీ లేవనిపించింది. అందుకే పైపైన మాట్లాడేసి, రాపిడ్‌ రౌండ్‌ పేరుతో ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టి షో అయిందనిపించారు. టాస్క్‌ ఆడుతుండగా భుజం డిస్‌ లొకేట్‌ అయిందనే పేరుతో నూతన్‌ నాయుడిని ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆయన క్షేమం గురించి కౌశల్‌ నానిని అడిగారు. రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని, ఆ తరువాత ఆయన ఇంట్లోకి వచ్చేదీ లేనిదీ బిగ్‌బాస్‌ ఇష్టమని నాని వెల్లడించారు. భుజానికి తీవ్రమైన గాయం అయిందని బిగ్‌బాస్‌ చెబితే…రెండు రోజుల్లో కోలుకుంటారని నాని చెప్పారు. అంత తీవ్రమైన గాయమైతే రెండు రోజుల్లో కోలుకోవడం సాధ్యమా? ఇందులో ఏదో నాటకీయత ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*